IPL 2025 : పోతూ.. పోతూ.. ధోని సేన ఎంత ప‌ని చేసింది మామ‌.. నాలుగు టీమ్‌ల భ‌విష్య‌త్తే మారిపోయిందిగా..

ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించ‌డంతో టాప్‌-2 రేసు మ‌రింత ఉత్కంఠ‌గా మారింది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఏవో ఇప్ప‌టికే తెలిసినప్ప‌టికి కూడా.. ఇంకా టాప్‌-2లో నిలిచే జ‌ట్లు ఏవో తేల‌లేదు. లీగ్ ద‌శ ముగిసే నాటికి టాప్‌-2లో నిలిచేందుకు నాలుగు జ‌ట్లు ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్‌లు పోటీప‌డుతున్నాయి.

ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించ‌డంతో టాప్‌-2 రేసు మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. చెన్నైతో మ్యాచ్‌లో గెలిచి ఉంటే గుజ‌రాత్ జ‌ట్టు అగ్ర‌స్థానంతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేది. ఇప్పుడు ఓడిపోవ‌డంతో గుజ‌రాత్ టాప్‌-2 అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. అదే స‌మ‌యంలో ఆర్‌సీబీ, పంజాబ్‌, ముంబైల‌కు చెన్నై విజ‌యం సాధించ‌డం బాగా క‌లిసి వ‌చ్చింది.

PBKS vs MI : ముంబైతో కీల‌క మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు భారీ షాక్‌..! శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పుడేం చేస్తాడో మ‌రీ..

పంజాబ్‌, ముంబైల మ‌ధ్య కీల‌క మ్యాచ్‌..
సోమ‌వారం పంజాబ్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా అగ్ర‌స్థానానికి చేరుకుంటుంది. పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉంటాయి. అదే ముంబై విజ‌యం సాధిస్తే 18 పాయింట్ల‌తో గుజ‌రాత్ తో స‌మంగా పాయింట్లు ఉంటాయి. కానీ గుజ‌రాత్ (+0.254) కంటే మెరుగైన నెట్ ర‌న్‌రేట్ క‌లిగి ఉండ‌డం ముంబై(+1.292)కి క‌లిసి వ‌స్తుంది.

ల‌క్నో పై గెలిస్తే..

ఇక ఆర్‌సీబీ త‌న చివ‌రి మ్యాచ్‌ను మే 27 ల‌క్నోతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే మిగిలిన జ‌ట్ల‌తో సంబంధం లేకుండా టాప్‌-2లో నిలుస్తుంది. ఒక‌వేళ ఓడిపోతే మాత్రం మూడు లేదా నాలుగు స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ల‌క్నోతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోతే అప్పుడు గుజ‌రాత్ టాప్‌-2లో ఉంటుంది.

SRH vs KKR : కోల్‌క‌తా పై ఘ‌న విజ‌యం.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ కామెంట్స్‌.. వాళ్ల‌ను చూస్తుంటే భ‌యంగా ఉంది

మొత్తంగా చెన్నై విజ‌యం సాధించ‌డంతో భ‌విష్య‌త్తే మారిపోయింది. కాగా.. పోతూ పోతూ ధోని సేన ఎంత ప‌ని చేసిందిరా అయ్యా అని అంటూ నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.