PBKS vs MI : ముంబైతో కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు భారీ షాక్..! శ్రేయస్ అయ్యర్ ఇప్పుడేం చేస్తాడో మరీ..
ముంబైతో కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే.. టాప్-2లో నిలిచే జట్లు ఏవో ఇంకా తేలలేదు. గుజరాత్, ఆర్‌సీబీ, ముంబై, పంజాబ్ జట్లు టాప్-2 స్థానంలో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఆదివారం చెన్నై చేతిలో గుజరాత్ ఓడిపోవడంతో ఈ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇక సోమవారం జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధిస్తే.. 19 పాయింట్లతో టాప్-2లో స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం టాప్-2 రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. ఇక ముంబై పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే 18 పాయింట్లతో టాప్-2లో ఉంటుంది. గుజరాత్ (+0.254) కంటే ముంబై (+1.292) నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండడం ఇక్కడ కలిసి వస్తుంది. ఒకవేళ ముంబై ఓడిపోతే నాలుగో స్థానంలోనే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
ఈ కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. పంజాబ్ ఆడిన చివరి మ్యాచ్ జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ అతడు ఆడలేదు. ESPNCricinfo నివేదిక ప్రకారం చాహల్ మణికట్టు గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో చాహల్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ప్లేఆఫ్స్ నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడనే విశ్వాసంతో ఉంది. ప్లేఆఫ్స్‌లో చాహల్ ఆడతాడనే నమ్మకంతో ఆ జట్టు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఢిల్లీతో మ్యాచ్‌లో అతడి స్థానంలో కర్ణాటక స్పిన్నర్ ప్రవీణ్ దూబే ఆడాడు.