SRH vs KKR : సన్‌రైజర్స్ పై ఓటమి.. కోల్‌కతా కెప్టెన్ రహానే సంచలన వ్యాఖ్యలు.. బౌలర్ల వల్లే ఓడిపోయాం.. నెక్స్ట్ సీజన్‌కు బలంగా తిరిగొస్తాం..
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

Courtesy BCCI
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 110 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (105 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76 పరుగులు), అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32) వేగంగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
ALSO READ : SRH vs KKR : కోల్‌కతా పై హెన్రిచ్ క్లాసెన్ రికార్డు శతకం.. అయినా కానీ.. క్రిస్ గేల్, వైభవ్ సూర్యవంశీల..
ఆ తరువాత భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే (37), సునీల్ నరైన్ (31) లు పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబెలు తలా మూడు వికెట్లు పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ పై ఓడిపోవడం పై కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ యూనిట్‌ను ఎదుర్కొనడానికి తమకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, కానీ బౌలర్లు వాటిని సరిగ్గా అమలు చేయడంలో విఫలం అయ్యారని అన్నాడు.
‘మేము స్లో బాల్స్ వేయడం, వైడర్ బౌలింగ్, వైడ్ స్లో బాల్స్ వేయడం గురించి చర్చించాము. కానీ కొన్నిసార్లు బౌలర్లు ప్రణాళికను సరిగ్గా అమలు చేయకపోతే.. క్లాసెన్, ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లందరూ దంచికొట్టారు. మేము మా ప్రణాళికలను చాలా తక్కువగా అమలు చేశాము. ఇక బౌలింగ్ యూనిట్ ఇన్నింగ్స్‌లో చాలా తప్పులు చేసింది.’ అని రహానె చెప్పాడు.
ఇక ఈ సీజన్ లో తాము రెండు మూడు మ్యాచ్‌ల్లో విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినట్లుగా తెలిపాడు. ఆ మ్యాచ్‌లను గెలిచి ఉంటే తాము టాప్ 2లో ఉండేవాళ్లమని అన్నాడు. ఈ సీజన్ చాలా కఠినంగా ఉందని వ్యాఖ్యానించిన రహానే కోల్‌కతా తిరిగి పుంజుకుంటుందని హామీ ఇచ్చారు.
‘ఈ సీజన్‌లో కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మ్యాచ్‌లను గెలిచేందుకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఓ రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఓ బ్యాటింగ్ యూనిట్‌గా బాగా ఆడలేదని అనుకుంటున్నాను. విజయం సాధించడం కోసం శాయశక్తలా ప్రయత్నించాం. ఈ ఫార్మాట్ చాలా కఠినమైనది. ఇక్కడ రాణించాంటే ప్రతిసారీ మీరు మారాలి. నిజం చెబుతున్న ఈ ఐపీఎల్ నిజంగా కఠినమైనది.’ అని రహానె చెప్పాడు.
‘మాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని గెలిచి ఉంటే.. బహుళా పాయింట్ల పట్టికలో ఒకటి లేదా రెండో స్థానంలో ఉండేవాళ్లం. అయినా ఎలాంటి విచారం లేదు. ఈ సీజన్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. మా ఆటగాళ్లు శాయశక్తులా ప్రయత్నించారు. వచ్చే ఏడాది మేము మరింత బలంగా తిరిగి వస్తాం.’ అని రహానె అన్నాడు.