SRH vs KKR : కోల్‌కతా పై హెన్రిచ్ క్లాసెన్ రికార్డు శతకం.. అయినా కానీ.. క్రిస్ గేల్, వైభవ్ సూర్యవంశీల..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అదరగొట్టాడు.

Courtesy BCCI
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అదరగొట్టాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో అతడికి ఇది రెండో శతకం కాగా.. ఈ క్రమంలో ఓ ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో అతడు యూసఫ్ పఠాన్ తో సమంగా నిలిచాడు.
Heinrich Klaasen in the history books. pic.twitter.com/gc3Ux13ua7
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2025
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాళ్లు వీరే..
క్రిస్‌గేల్ (ఆర్‌సీబీ) – 30 బంతుల్లో – 2013లో పూణే వారియర్స్ పై
వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – 35 బంతుల్లో – 2025లో గుజరాత్ టైటాన్స్ పై
యూసఫ్ పఠాన్ (రాజస్థాన్ రాయల్స్) – 37 బంతుల్లో 2010లో ముంబై ఇండియన్స్ పై
హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 37 బంతుల్లో – 2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పై
డేవిడ్ మిల్లర్ (పంజాబ్ కింగ్స్) – 38 బంతుల్లో – 2013లో ఆర్‌సీబీ పై
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. క్లాసెన్ వీధ్వంసకర శతకంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మిగిలిన వారిలో ట్రావిస్ హెడ్ (76; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), అభిషేక్ శర్మ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా విఫలమైంది. 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్ నరైన్ (31 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీశ్ పాండే (37; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబెలు తలా మూడు వికెట్లు తీశారు.
Clean. Clinical. Carnage. 🧡pic.twitter.com/ikgOvb6W5w
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025