CSK birthday wishes to Sanju Samson ahead of Trade Speculations
Sanju Samson : టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. నిన్న, మొన్నటి వరకు భారత టీ20 జట్టులో అతడి స్థానం పై చర్చలు జరుగగా.. ప్రస్తుతం ఐపీఎల్ ట్రేడింగ్‌లో అతడు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు మారనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.
నేడు (నవంబర్ 11 ) సంజూ శాంసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చెన్నై జట్టు అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
More power to you, Sanju! Wishing you a super birthday! 🥳💛#WhistlePodu pic.twitter.com/f2lE6pWkPy
— Chennai Super Kings (@ChennaiIPL) November 11, 2025
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు డిసెంబర్‌లో మినీ వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలాని కన్నా ముందే ట్రేడింగ్ విండో ద్వారా పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు అన్ని ఫ్రాంఛైజీలు తమ చర్యలను ముమ్మరం చేశాయి. ఇందులో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది మాత్రం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్ ట్రేడింగ్ డీల్.
అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూరైనట్లు తెలుస్తోంది. సంజూని చెన్నైకి వస్తే.. అతడి స్థానంలో చెన్నై ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ కోరినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. జడేజాను ఇచ్చేందుకు సీఎస్‌కే సిద్ధంగానే ఉందని, అయితే.. కర్రన్ విషయంలోనే కాస్త ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ డీల్ పూర్తి కానున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలోనే సీఎస్‌కే సంజూ శాంసన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేయడం చూస్తుంటే అతడు సీఎస్‌కే జట్టులోకి రావడం ఖాయమేనని అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ట్రేడ్ విండోకి నవంబర్ 15 డెడ్‌లైన్ అన్న సంగతి తెలిసిందే.