Dhoni Meets Matheesha Pathirana's Family
Dhoni Meets Matheesha Pathirana’s Family: గతేడాది పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ఈ సారి మాత్రం దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్(IPL)లో ఐదో టైటిల్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఫైనల్‌లో క్వాలిఫయర్ 2 విజేతతో తలపడనుంది. చెన్నై సాధిస్తున్న విజయాల్లో యువ ఆటగాడు, జూనియర్ మలింగగా అభిమానులు ముద్దుగా పిలిచుకుంటున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ(Matheesha Pathirana) కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కెప్టెన్ ధోని(MS Dhoni) తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ తన వంతు పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. గురువారం(మే 25) చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో మహేంద్ర సింగ్ ధోనిని మతీష పతిరణ కుటుంబం కలిసింది. ఈ విషయాన్ని పతిరణ సోదరి విషుకా పతిరణ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా కెప్టెన్ కూల్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది.
MS Dhoni: ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ ఆటగాడు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు
మతీషా పతిరణ విషయంలో ధోని తమ కుటుంబానికి భరోసా ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు మల్లి(మతీష పతిరణ ముద్దు పేరు) సురక్షితంగా ఉన్నాడని నిశ్చయించుకున్నాము. మతీషా పతిరణ గురించి చింతించాల్సిన పనిలేదని, అతడు ఎల్లప్పుడూ తనతోనే ఉంటున్నట్లు ధోని చెప్పినట్లు విషుకా తెలిపింది. ఇక ధోనిని కలిసిన క్షణాలు తాను కలలు గన్న దానికి మించి ఉన్నాయంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Naveen Ul Haq: విరాట్ కోహ్లికి సారీ చెప్పిన నవీన్ ఉల్ హక్.. నిజమెంత..?
ఇదిలా ఉంటే.. మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫైనల్‌లో చెన్నై విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. మరీ వారి కోరికను చెన్నై నెరవేరుస్తుందా..? లేదా అన్నది ఆదివారం తేలనుంది.