MS Dhoni: ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గ‌జ ఆట‌గాడు.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

ఆదివారం కోల్‌క‌తాతో చెన్నై మ్యాచ్ ముగిసిన అనంత‌రం గ‌వాస్క‌ర్ చేసిన ప‌నికి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. ధోని వ‌ద్ద‌కు టీమ్ ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, వ్యాఖ్య‌త అయిన సునీల్ గ‌వాస్క‌ర్ వ‌చ్చాడు. ఆటోగ్రాఫ్ కావాల‌ని అడిగాడు.

MS Dhoni: ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గ‌జ ఆట‌గాడు.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

Sunil Gavaskar- MS Dhoni

Dhoni-SunilGavaskar: మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆట‌తీరు, అత‌డి వ్య‌క్తిత్వానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోని అభిమానుల జాబితాలో సామాన్యుల నుంచి సినీ సెల‌బ్రెటీలు, దిగ్గ‌జ క్రీడాకారులు ఉన్నారు. టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) సైతం మ‌హేంద్రుడికి అభిమాని అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. ఆదివారం కోల్‌క‌తాతో చెన్నై మ్యాచ్ ముగిసిన అనంత‌రం గ‌వాస్క‌ర్ చేసిన ప‌నికి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు.

కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై ఓట‌మి పాలైంది. అయిన‌ప్ప‌టికి ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు వ‌చ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. కాగా.. ఈ సీజ‌న్‌లో చెపాక్ మైదానంలో లీగ్ స్టేజ్‌లో ఇదే చివ‌రి మ్యాచ్‌. దీంతో చెన్నైకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు పెద్ద సంఖ్య‌లో అభిమానులు స్టేడియానికి వ‌చ్చారు. మ్యాచ్ ముగియ‌గానే ధోనితో పాటు చెన్నై ఆట‌గాళ్లు మైదానం మొత్తం క‌లియ‌తిరిగారు. టెన్నిస్ రాకెట్లు ప‌ట్టుకుని, జెర్సీల‌ను అభిమానుల వైపు విసిరారు.

IPL 2023: చెన్నై పై గెలిచిన కేకేఆర్‌కు భారీ షాక్‌.. కెప్టెన్ నితీశ్ రాణాకు రూ.24ల‌క్ష‌లు, మిగిలిన వారికి రూ.6ల‌క్ష‌ల జ‌రిమానా

ఇదే స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ధోని వ‌ద్ద‌కు టీమ్ ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, వ్యాఖ్య‌త అయిన సునీల్ గ‌వాస్క‌ర్ వ‌చ్చాడు. ఆటోగ్రాఫ్ కావాల‌ని అడిగాడు. దిగ్గ‌జ ఆట‌గాడు అడిగితే ధోని కాదంటాడా చెప్పండి వెంట‌నే సునీల్ గవాస్క‌ర్ ష‌ర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అనంత‌రం ఇద్ద‌రు ఒక‌రినొక‌రు ఆలింగ‌నం చేసుకున్నారు. అనంత‌రం సునీల్ గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ త‌దుప‌రి మ్యాచ్‌ల నుంచి నాకు ఇంకో పింక్ చొక్కా ఇవ్వాల‌ని కోరాడు.

రింకూ సింగ్ సైతం

ఈ మ్యాచ్‌లో అర్ధ‌శ‌త‌కం చేసి చెన్నై ఓట‌మికి కార‌ణ‌మైన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఆట‌గాడు రింకూ సింగ్ సైతం ధోనిని క‌లిసి అత‌డి ఆటోగ్రాప్‌ను తీసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన త‌రువాత రింకూ సింగ్ ధోని వ‌ద్ద‌కు వ‌చ్చాడు. కోల్‌క‌తా జెర్సీపై ఆటోగ్రాఫ్ కావాల‌ని అడిగాడు. ధోని వెంట‌నే అత‌డికి ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం ఈ రెండింటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా.. మ‌హేంద్ర సింగ్ ధోనికి ఇదే చివ‌రి సీజ‌న్ అన్న ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో చెన్నై హోంగ్రౌండ్‌లో ఆఖ‌రి మ్యాచ్ ఆడ‌టంతో అభిమానులు భావోద్వేగానికి గురైయ్యారు.