IPL 2023: చెన్నై పై గెలిచిన కేకేఆర్‌కు భారీ షాక్‌.. కెప్టెన్ నితీశ్ రాణాకు రూ.24ల‌క్ష‌లు, మిగిలిన వారికి రూ.6ల‌క్ష‌ల జ‌రిమానా

చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను దాని సొంత గ‌డ్డ‌పై ఓడించి పుల్ జోష్‌లో ఉంది కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌. అయితే.. ఈ ఆనందం కేకేఆర్‌కు లేకుండా పోయింది. జ‌ట్టు కెప్టెన్ నితీశ్ రాణాతో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా తుది జ‌ట్టులో ఆడిన ఆట‌గాళ్లంద‌రికి ఫైన్ ప‌డింది.

IPL 2023: చెన్నై పై గెలిచిన కేకేఆర్‌కు భారీ షాక్‌.. కెప్టెన్ నితీశ్ రాణాకు రూ.24ల‌క్ష‌లు, మిగిలిన వారికి రూ.6ల‌క్ష‌ల జ‌రిమానా

Nitish Rana fined

Nitish Rana: చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)ను దాని సొంత గ‌డ్డ‌పై ఓడించి పుల్ జోష్‌లో ఉంది కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌(Kolkata Knight Riders). ఆదివారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై పై కోల్‌క‌తా విజ‌యం సాధించింది. అయితే.. ఈ ఆనందం కేకేఆర్‌కు లేకుండా పోయింది. జ‌ట్టు కెప్టెన్ నితీశ్ రాణా(Nitish Rana) తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్(Impact Player) స‌హా తుది జ‌ట్టులో ఆడిన ఆట‌గాళ్లంద‌రికి ఫైన్ ప‌డింది.

కెప్టెన్ అయిన నితీశ్ రాణాకు రూ.24ల‌క్ష‌లు, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా తుది జ‌ట్టులో ఆడిన ఆట‌గాళ్ల‌కు రూ.6ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహ‌కులు. స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగానే ఫైన్ విధించిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. చెన్నైతో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత స‌మ‌యానికి ఓ ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆఖ‌రి ఓవ‌ర్‌లో స‌ర్కిల్ బ‌య‌ట న‌లుగురు ఫీల్డ‌ర్ల‌తో కేకేఆర్ బౌలింగ్ చేసింది. అనంత‌రం ఫైన్ విధించారు.

IPL 2023: అర్ధ‌శత‌కాల‌తో రాణించిన నితీశ్ రాణా, రింకూ సింగ్‌.. చెన్నై పై కోల్‌క‌తా విజ‌యం

ఐపీఎల్ నిబంధ‌న‌లు ప్ర‌కారం ప్ర‌తీ జ‌ట్టు 90 నిమిషాల స‌మ‌యంలో 20 ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. స్ట్రాటజిక్ టైమ్‌ ఔట్‌లు, డీఆర్ఎస్, అంపైర్లు రివ్యూలు వంటి వాటి కోసం ప‌ట్టిన స‌మ‌యానికి మిన‌హాయింపు ఉంటుంది. ఓ సీజ‌న్‌లో నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌కుంటే తొలిసారి ఆ జ‌ట్టు కెప్టెన్‌కు రూ.12ల‌క్ష‌లు, రెండోసారి జ‌రిగితే కెప్టెన్‌కు రూ.24ల‌క్ష‌ల‌తో పాటు ఆట‌గాళ్లంద‌రికి రూ.6ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు.

మూడోసారి కూడా పున‌రావృతం అయితే జ‌ట్టు కెప్టెన్‌కు రూ.30ల‌క్ష‌లు జ‌రిమానా విధించ‌డంతో పాటు ఓ మ్యాచ్ నిషేదం విధిస్తారు. జ‌ట్టులోని మిగ‌తా ఆట‌గాళ్ల‌కు రూ.12ల‌క్ష‌ల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. కేకేఆర్ ఈ సీజ‌న్‌లో రెండోసారి స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేయ‌డంతో నితీశ్ రాణాకు రూ.24ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది. మ‌రోసారి రిపీట్ అయితే మాత్రం అత‌డిపై ఓ మ్యాచ్ నిషేదం ప‌డ‌నుంది.

IPL 2023: ప్రీతీ జింటా చేసిన ప‌నికి షాకైన శ‌త‌క‌ వీరుడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌