IPL 2023: ప్రీతీ జింటా చేసిన పనికి షాకైన శతక వీరుడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్
విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండడంతో పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతీ జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Prabhsimran Singh-Preity Zinta
Preity Zinta-Prabhsimran Singh: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(Prabhsimran Singh) 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇది అతడికి ఐపీఎల్‌లో మొదటి శతకం. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఢిల్లీ పై పంజాబ్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ తరుపున ఇదే తొలి శతకం కావడం, జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండడంతో పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతీ జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శతక వీరుడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కౌగిలించుకుని తన సంతోషాన్ని తెలియజేసింది 48 ఏళ్ల ఈ నటి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
When Preity Zinta Ji is happy. We see happiness throughout the world.
❤️ pic.twitter.com/UwIw9PMAo2— Abhishek Ojha (@vicharabhio) May 13, 2023
మ్యాచ్ అనంతరం ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మాట్లాడుతూ.. ఆరంభంలోనే మూడు వికెట్లు(శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ) కోల్పోవడంతో సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి, వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని అనుకున్నట్లు చెప్పాడు. ‘చాలా కాలంగా జట్టుతో కలిసి ఉన్నాను. సీనియర్ ఆటగాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్లు ఎక్కువగా ఒక్కటే విషయాన్ని చెబుతారు. పెద్ద ఇన్నింగ్స్ ఆడమని ప్రోత్సహిస్తారు. వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో కొంచెం కష్టంగా ఉంది. సామ్ కరన్‌తో భాగస్వామ్యం కీలకంగా మారింది. ఈ శతకం నాకు చాలా ప్రత్యేకం.’ దీని కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసినట్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తెలిపాడు.
IPL 2023: ఢిల్లీ పై పంజాబ్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
This smile says it all❤️#PreityZinta #DCvPBKS #IPL2023 pic.twitter.com/nZIY2eH8Hm
— Masum (@masum_twt) May 13, 2023
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 153.91 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు.