AUS vs ENG : రసవత్తరంగా పెర్త్ టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లాండ్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ (AUS vs ENG) రసవత్తరంగా సాగుతోంది.
AUS vs ENG 1st Test Australia target is 205
AUS vs ENG : పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్ పై 40 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఆస్ట్రేలియా ముందు ఇంగ్లాండ్ 205 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో గస్ అట్కిన్సన్ (37), ఓలీ పోప్ (33), బెన్ డకెట్ (28) లు రాణించారు. జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్‌లు డకౌట్ అయ్యారు. జోరూట్ (8), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (2) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, బ్రెండన్ డాగెట్ చెరో మూడు వికెట్లు తీశారు.
Asia cup raisins star 2025 : చచ్చీ చెడీ ఫైనల్‌కు చేరిన పాక్.. ఆదివారం మహా సంగ్రామం..
అంతకముందు 123/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్. జేక్ వెదర్లాండ్ (0), లబుషేన్ (9), స్టీవ్ స్మిత్ (17), ఉస్మాన్ ఖవాజా (2), ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24), మిచెల్ స్టార్క్ (12) విపలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
AUSTRALIA NEED 205 TO WIN THE PERTH TEST. pic.twitter.com/PBJoQmJ2XZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2025
