Asia cup raisins star 2025 : చ‌చ్చీ చెడీ ఫైన‌ల్‌కు చేరిన పాక్‌.. ఆదివారం మ‌హా సంగ్రామం..

ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ 2025లో (Asia cup raisins star 2025) పాకిస్తాన్-ఏ జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంది.

Asia cup raisins star 2025 : చ‌చ్చీ చెడీ ఫైన‌ల్‌కు చేరిన పాక్‌.. ఆదివారం మ‌హా సంగ్రామం..

Asia cup raisins star 2025 pakistan enter into final

Updated On : November 22, 2025 / 12:27 PM IST

Asia cup raisins star 2025 : ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ 2025లో పాకిస్తాన్-ఏ జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జ‌ట్టుపై పాక్ 5 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఘాజి ఘోరి (39 నాటౌట్‌), సాద్‌ మసూద్‌ (22), అహ్మద్‌ దానియాల్‌ (22) రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ప్ర‌మోద్ మ‌దూశ‌న్ నాలుగు వికెట్లు తీశాడు. ట్రవీన్ మ్యాథ్యూ మూడు వికెట్లు తీశాడు. మిలాన్‌ రత్మనాయకె, కెప్టెన్‌ దునిత్‌ వెల్లలగే చెరో వికెట్‌ పడగొట్టారు.

IND vs SA : ల‌డ్డూ లాంటి క్యాచ్‌ను మిస్ చేసిన కేఎల్ రాహుల్‌.. బుమ్రా రియాక్ష‌న్ వైర‌ల్‌

ఆ త‌రువాత 154 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన శ్రీలంక‌కు శుభారంభమే ల‌భించింది. ఓపెనర్లు లసిత్‌ క్రూస్‌పులె (7 బంతుల్లో 27 ప‌రుగులు) వేగంగా ఆడాడు. విషేన్‌ హలాంబగే (27 బంతుల్లో 29) ఫ‌ర్వాలేద‌నిపించారు. అయితే, పాక్‌ బౌలర్ల ధాటికి మిడిల్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. నిషాన్‌ మధుష్క (6), నువానిడు ఫెర్నాండో (5), సాహన్‌ అరాచిగే (5), వెల్లలగే (2), రమేశ్‌ మెండిస్‌ (0) ఘోరంగా విప‌లం అయ్యారు.

అయితే.. మిలాన్‌ రత్ననాయకె 32 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 40 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారి నుంచి అత‌డికి స‌హ‌కారం అంద‌లేదు. చివ‌రికి లంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 148 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆఖ‌రికి ఐదు ప‌రుగుల తేడాతో ఓట‌మిని చవిచూసింది. దీంతో పాక్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

India A vs Bangladesh A : సూప‌ర్ ఓవ‌ర్ డ్రామా.. వైభ‌వ్ సూర్య‌వంశీని బ్యాటింగ్‌కు పంప‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే..

మ‌రో సెమీస్ మ్యాచ్‌లో భార‌త్‌ను సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడించి బంగ్లాదేశ్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంది. న‌వంబ‌ర్ 23 ఆదివారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య‌ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.