David Warner : బెంగ‌ళూరులో దంచికొట్టిన వార్న‌ర్ మామ‌.. చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. ప‌లు రికార్డులు బ్రేక్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.

David Warner

Warner : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. బెంగ‌ళూరు వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. ప‌ట్ట‌ప‌గ‌లే పాక్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. సిక్స‌ర్లు, ఫోర్లతో విరుచుకుప‌డి కేవ‌లం 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌తో 163 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డులు అత‌డి ఖాతాలో వ‌చ్చి చేరాయి. ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ 84 బంతుల్లోనే శ‌త‌కం చేయ‌డం గ‌మ‌నార్హం.

చ‌రిత్ర సృష్టించిన వార్న‌ర్‌.. ఒకే ఒక్క‌డు..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ల‌లో డేవిడ్ వార్న‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల్లో మూడు సార్లు 150+స్కోర్లు సాధించిన ఏకైక ఆట‌గాడిగా నిలిచాడు. బెంగ‌ళూరు వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లోనే అత‌డు ఈ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ 163 ప‌రుగులు చేశాడు. గ‌తంలో 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్థాన్ పై 178 ప‌రుగులు, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్ పై 166 ప‌రుగులు చేశాడు.

ఆ జాబితాలో రెండో స్థానం..

వ‌న్డేల్లో అత్య‌ధిక సార్లు 150+ స్కోర్లు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. రోహిత్ మొత్తం 8 సార్లు 150+స్కోర్లు చేశాడు. ఆ త‌రువాతి స్థానంలో డేవిడ్ వార్న‌ర్ కొన‌సాగుతున్నాడు. వార్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు 7 సార్లు 150+స్కోర్లు చేశాడు. ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌రువాత స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌లు త‌లా 5 సార్లు ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు.

Mitchell Marsh : పుట్టిన రోజు నాడే సెంచ‌రీ చేసిన మిచెల్ మార్ష్‌.. ఇంకా ఎవ‌రెవ‌రు ఇలా చేశారంటే..?

వ‌న్డేల్లో అత్యధిక 150+ స్కోర్లు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

రోహిత్ శర్మ (భార‌త్‌) – 8 సార్లు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 7 సార్లు
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 5 సార్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 5 సార్లు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 5 సార్లు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వార్న‌ర్‌కు ఇది 5వ శ‌త‌కం..

కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వార్న‌ర్‌కు ఇది ఐదో శ‌త‌కం. ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాళ్లు రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్క‌ర స‌ర‌స‌న చేశాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కొన‌సాగుతున్నాడు. రోహిత్ 7 శ‌త‌కాలు బాదాడు. ఆ త‌రువాత స‌చిన్ ఆరు శ‌త‌కాల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ప్రపంచకప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

రోహిత్ శర్మ (భార‌త్‌) – 7
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 6
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 5
కుమార సంగక్కర (శ్రీలంక‌) – 5
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 5

కోహ్లీ రికార్డు స‌మం..

డేవిడ్ వార్న‌ర్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఒకే జ‌ట్టుపై వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును వార్న‌ర్ స‌మం చేశాడు. కోహ్లీ వెస్టిండీస్‌పై నాలుగు శ‌త‌కాలు బాద‌గా.. నేటి మ్యాచ్‌తో క‌లిపి పాకిస్థాన్ పై వార్న‌ర్ నాలుగు సెంచ‌రీలు చేశాడు.

 

ODI World Cup 2023 : విరాట్ కోహ్లీ సెంచ‌రీకి అంపైర్ సాయం చేశాడా..? అది వైడా..? కాదా..?

ట్రెండింగ్ వార్తలు