Mitchell Marsh : పుట్టిన రోజు నాడే సెంచ‌రీ చేసిన మిచెల్ మార్ష్‌.. ఇంకా ఎవ‌రెవ‌రు ఇలా చేశారంటే..?

పుట్టిన రోజు అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన రోజు. అలాంటి ప్ర‌త్యేక‌మైన రోజున శ‌త‌కం సాధించి ఆ బ‌ర్త్ డేను చాలా మెమ‌ర‌బుల్‌గా చేసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ కోరుకుంటాడు.

Mitchell Marsh : పుట్టిన రోజు నాడే సెంచ‌రీ చేసిన మిచెల్ మార్ష్‌.. ఇంకా ఎవ‌రెవ‌రు ఇలా చేశారంటే..?

Mitchell Marsh century

Mitchell Marsh Century : పుట్టిన రోజు అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన రోజు. అలాంటి ప్ర‌త్యేక‌మైన రోజున శ‌త‌కం సాధించి ఆ బ‌ర్త్ డేను చాలా మెమ‌ర‌బుల్‌గా చేసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ కోరుకుంటాడు. బ‌ర్త్ డే నాడు సెంచ‌రీ చేసే అవ‌కాశం అంద‌రికి రాదు. అదీనూ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లాంటి మెగా ఈవెంట్‌లో సెంచ‌రీ చేస్తే వ‌చ్చే కిక్కే వేరు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మిచెల్ మార్ష్ ఆ మ‌జానే అస్వాదిస్తున్నాడు. బెంగ‌ళూరు వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘ‌న‌త‌ను అత‌డు సాధించాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన మిచెల్ మార్ష్ పాకిస్థాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో పెను విధ్వంసం సృష్టించాడు. సరిగ్గా వంద బంతుల్లో సెంచ‌రీ చేశాడు.

ODI World Cup 2023 : విరాట్ కోహ్లీ సెంచ‌రీకి అంపైర్ సాయం చేశాడా..? అది వైడా..? కాదా..?

కాగా.. ఈ రోజు (అక్టోబ‌ర్ 20న‌) మిచెల్ మార్ష్ 32వ పుట్టిన రోజు కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ మ్యాచులో 108 బంతులు ఆడి 10 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌లో 121 ప‌రుగులు చేశాడు. ఇలా పుట్టిన రోజు నాడే సెంచ‌రీ చేయ‌డంతో ఈ శ‌త‌కం మార్ష్‌కు మెమ‌ర‌బుల్‌గా మిగిలిపోతుంది అన‌డంలో సందేహం లేదు. భార‌త్ దిగ్గజ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, వినోద్ కాంబ్లీ లు కూడా త‌మ పుట్టిన రోజున శ‌త‌కాలు సాధించారు.

పుట్టిన రోజు నాడే వ‌న్డే శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్ల జాబితా ఇదే..

టామ్ లాథమ్ (న్యూజిలాండ్‌) 140 నాటౌట్ – నెద‌ర్లాండ్స్ పై హామిల్టన్ లో 2022 (30వ పుట్టినరోజు)
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) 134 – ఆస్ట్రేలియా పై షార్జాలో 1998 (25వ పుట్టినరోజు)
రాస్ టేలర్ (న్యూజిలాండ్‌) 131 నాటౌట్‌ – పాకిస్థాన్ పై పల్లెకెలెలో 2011 (27వ పుట్టినరోజు)
సనత్ జయసూర్య (శ్రీలంక‌) 130 – బంగ్లాదేశ్ పై కరాచీలో 2008 (39వ పుట్టినరోజు)
వినోద్ కాంబ్లీ (భార‌త్‌) 100 నాటౌట్‌ – ఇంగ్లాండ్ పై జైపూర్‌లో 1993 (21వ పుట్టినరోజు)
మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) 121 – పాకిస్థాన్ పై బెంగళూరులో 2023 (32వ పుట్టినరోజు)

ODI World Cup 2023 : రోహిత్ సేన ఎంత ప‌ని చేసింది..? పాకిస్థాన్ న‌టి డేటింగ్ మిస్‌.. అమ్మ‌డు ఇప్పుడేమందో తెలుసా..?

ఆ జాబితాలో రెండో స్థానం..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పుట్టిన రోజు నాడే శ‌త‌కం చేసిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో ఆట‌గాడిగా మిచెల్ మార్ష్ చోటు ద‌క్కించుకున్నాడు. అత‌డి కంటే ముందు 2011లో ప‌ల్లెక‌లెలో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆట‌గాడు రాస్‌టేల‌ర్ (131) శ‌త‌కం చేశాడు.