David Warner : వీరేంద్ర సెహ్వాగ్‌ను వెన‌క్కి నెట్టిన వార్న‌ర్‌.. అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) టెస్టుల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

David Warner - Virender Sehwag

David Warner Milestone : ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) టెస్టుల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న వార్న‌ర్ నాలుగు బౌండ‌రీల‌తో 36 ప‌రుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త విధ్వంస‌క‌ర వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ ను వార్న‌ర్ అధిగ‌మించాడు.

Ashes 2023 : స్టీవ్ స్మిత్‌ను అవ‌మానించిన ఇంగ్లాండ్ అభిమానులు.. ‘నువ్వు ఏడుస్తుంటే మేము టీవీల్లో చూశాం’..

99 మ్యాచ్‌ల్లో 50.04 సగటుతో 8207 పరుగులు చేసిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్న‌ర్ అధిగ‌మించాడు. ఓపెనర్‌గా సెహ్వాగ్ 22 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు చేశాడు. వార్న‌ర్‌ 105 మ్యాచ్‌ల్లో 45.60 సగటుతో 8208 పరుగులు చేశాడు. ఇందులో 25 శ‌త‌కాలు చేశాడు. ఇక టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ల జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. కుక్ 44.86 సగటుతో 11,845 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 50.29 సగటుతో 9,607 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు

Ravindra Jadeja : జ‌డేజాను మాయ చేసింది.. ప‌బ్లిక్‌గానే క్ర‌ష్ నుంచి ప్ర‌మోష‌న్ ఇచ్చి మ‌రీ..

– అలస్టర్ కుక్ (ఇంగ్లాండ్‌) 11,845 ప‌రుగులు
– సునీల్ గవాస్కర్ (ఇండియా) 9,607 ప‌రుగులు
– గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా) 9,030 ప‌రుగులు
– మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా) 8,625 ప‌రుగులు
– డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 8,208 ప‌రుగులు
– వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా) 8,207 ప‌రుగులు

Suraj Randiv : 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ధోనికి ప్ర‌త్య‌ర్థిగా.. ఐపీఎల్‌లో మ‌హితో క‌లిసి ఆడిన ఓ మాజీ క్రికెట‌ర్ ధీన గాధ‌..