David Warner : ఏ క్రికెట‌ర్‌కు ఇలా సాధ్యం కాలేదు.. సిడ్నీ స్టేడియానికి వార్న‌ర్ ఎలా వ‌చ్చాడో తెలుసా..?

ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ హాలీవుడ్ హీరో త‌ర‌హాలో మైదానంలో అడుగుపెట్టాడు.

David Warner makes grand entry via chopper at SCG

Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ హాలీవుడ్ హీరో త‌ర‌హాలో మైదానంలో అడుగుపెట్టాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లో ఆడేందుకు ఓ ప్రైవేటు హెలికాఫ్ట‌ర్‌లో సిడ్నీ మైదానంలో ల్యాండ్ అయ్యాడు. వ‌న్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన త‌రువాత వార్న‌ర్ ఆడబోతున్న మ్యాచ్ కోసం బీబీఎల్ యాజ‌మాన్యం ప్ర‌త్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. శుక్ర‌వారం జ‌న‌వ‌రి 12న‌ ఉద‌యం హాంట‌ర్ హ్యాలీలో త‌న సోద‌రుడి వివాహానికి హాజ‌రైన వార్న‌ర్ అక్క‌డి నుంచి 250 కిలోమీట‌ర్ల దూరంలోని మ్యాచ్ వేదిక అయిన సిడ్నీ గ్రౌండ్‌కు ఇలా హెలికాఫ్ట‌ర్‌లో వ‌చ్చాడు.

హెలికాఫ్ట‌ర్ నుంచి కింద‌కు దిగిన వెంట‌నే వార్న‌ర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కు సిద్ధం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. సిడ్నీథండ‌ర్స్ తో వార్న‌ర్ రెండేళ్లు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఈ క్ర‌మంలో సిడ్నీ సిక్స‌ర్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కోసం అత‌డు ఇలా మైదానంలోకి అడుగుపెట్టాడు.

Also Read: తీవ్ర నిరాశ.. అదే సమయంలో కోపం.. పిచ్‌లోనే గిల్‌పై కస్సుబుస్సు.. ఏంటి రోహిత్ ఇదీ?

సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడ‌గా కేవ‌లం ఒక్క‌దానిలోనే విజ‌యం సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచి ఆడ‌నున్న ప్ర‌తీ మ్యాచులో విజ‌యం సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. వార్న‌ర్ చేరిక‌తో ఆ జ‌ట్టు బ‌లం పెరిగింది. మ‌రో వైపు సిడ్నీ సిక్స‌ర్ ఎనిమిది మ్యాచులు ఆడ‌గా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడిపోగా మ‌రో రెండు మ్యాచులు వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యాయి. 10 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్స‌ర్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. జోష్ పిలిఫ్ (47), జోర్డాన్ సిల్క్ (35), స్టీవ్ స్మిత్ (27) లు రాణించారు.

Also Read : భలే భలే మగాడివోయ్..! అతడి పేరును ఎలా మర్చిపోయావ్ రోహిత్ భయ్యా?

ట్రెండింగ్ వార్తలు