Viral Video: తీవ్ర నిరాశ.. అదే సమయంలో కోపం.. పిచ్‌లోనే గిల్‌పై కస్సుబుస్సు.. ఏంటి రోహిత్ ఇదీ?

క్రికెట్లో రనౌట్ కావడం సాధారణమేనని, అటువంటి సమయంలో అసహనానికి గురికావడమే కామనేనని రోహిత్ అన్నాడు.

Viral Video: తీవ్ర నిరాశ.. అదే సమయంలో కోపం.. పిచ్‌లోనే గిల్‌పై కస్సుబుస్సు.. ఏంటి రోహిత్ ఇదీ?

Rohit sharma

టీ20 మ్యాచులో 14 నెలల తర్వాత ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డకౌట్ కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. మైదానం నుంచి వెళ్తూ శుభ్‌మ‌న్ గిల్‌పై ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మొహాలీ వేదిక‌గా నిన్న అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన తొలి మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో భారత్ విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ టీ20ల్లో ఆడుతుండడంతో అతడి ఆటతీరు ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. అలాగే, క్రీజులోకి వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు.

కేవలం రెండే బంతులు ఆడిన రోహిత్ శర్మ.. అఫ్గాన్ బౌలర్ ఫజల్హాక్ ఫారుఖీ వేసిన బంతికి పరుగు తీయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ కదలలేదు. అఫ్గాన్ ఫీల్డర్ ఇబ్రహీం జద్రాన్ బంతిని ఆపడంతో గిల్ అతడి వైపే చూస్తూ నిలబడిపోయాడు. జద్రాన్ ఆ బాల్‌ను వెంటనే వికెట్‌ వైపునకు విసరగా.. కీపర్ గుర్బాక్ వికెట్లను బంతితో కొట్టాడు.

దీంతో రోహిత్ రనౌట్ అయ్యాడు. దీంతో పరుగు తీయకుండా నిలబడ్డ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయాడు రోహిత్. మ్యాచ్ అయిపోయాక రోహిత్ మాట్లాడుతూ.. క్రికెట్లో రనౌట్ కావడం సాధారణమేనని, అటువంటి సమయంలో అసహనానికి గురికావడమే కామనేనని రోహిత్ చెప్పుకొచ్చాడు. దీంతో రోహిత్ మంచోడే కానీ, అప్పుడప్పుడు అతడికి కోపం వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా, మొదటి టీ20లో రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ అయిన‌ప్ప‌టికీ శివం దుబే (60), జితేశ్ శ‌ర్మ (31), తిల‌క్ వ‌ర్మ (26), శుభ్‌మ‌న్ గిల్ (23), రింకూ సింగ్ (16) రాణించారు. అఫ్గాన్ ఇచ్చిన 159 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

Rohit Sharma : భలే భలే మగాడివోయ్..! అతడి పేరును ఎలా మర్చిపోయావ్ రోహిత్ భయ్యా?