David Warner : డేవిడ్ వార్న‌ర్ భారీ శ‌త‌కం.. మిచెల్ జాన్సెన్‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు..

David Warner Century : గ‌త కొంత‌కాలంగా టెస్టుల్లో పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డ్డ వార్న‌ర్ ఆఖ‌రి టెస్టు సిరీస్‌లో మాత్రం దుమ్ములేపాడు.

David Warner Century

స్వ‌దేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం సుదీర్ఘ పార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య నేడు (గురువారం డిసెంబ‌ర్ 14) మొద‌టి టెస్టు ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. గ‌త కొంత‌కాలంగా టెస్టుల్లో పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డ్డ వార్న‌ర్ ఆఖ‌రి టెస్టు సిరీస్‌లో మాత్రం దుమ్ములేపాడు.

మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. టెస్టు మ్యాచును కూడా టీ20ల్లాగా ఆడుతున్నాడు. ఎడా పెడా బౌండ‌రీలు కొడుతూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు కుదురుకోనియ‌కుండా చేశాడు. ఈ క్ర‌మంలో 41 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం అందుకున్న వార్న‌ర్ ఆ త‌రువాత మ‌రింత వేగంగా బ్యాటింగ్ చేశాడు. అయితే.. శ‌త‌కానికి ముందు కాస్త నెమ్మ‌దించిన వార్న‌ర్ మొత్తంగా 125 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో వార్న‌ర్‌కు ఇది 26 సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక వార్న‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇది 49వ శ‌త‌కం కావ‌డం విశేషం.

Mohammed Shami : అర్జున అవార్డు రేసులో మహ్మద్‌ షమీ..! క్రీడా మంత్రిత్వ శాఖ‌కు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్

శ‌త‌కం త‌రువాత వార్న‌ర్ మరింత దూకుడుగా ఆడాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న వార్న‌ర్ 16 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 164 ప‌రుగులు చేశాడు. అమీర్ జమాల్ బౌలింగ్‌లో ఇమామ్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. వార్న‌ర్ ఔట్ అయ్యే స‌మ‌యానికి ఆస్ట్రేలియా స్కోరు 5 వికెట్ల న‌ష్టానికి 322 ప‌రుగులుగా ఉంది.

మిచెల్ జాన్సెన్ పై మీమ్స్‌..

కాగా.. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు వార్న‌ర్ ను ఎంపిక చేయ‌డాన్ని ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ మిచెల్ జాన్సెన్ త‌ప్పు ప‌ట్టాడు. బాల్ టాంప‌రింగ్ వివాదంతో ఆస్ట్రేలియా ప‌రువు తీసిన వార్న‌ర్‌కు హీరోగా వీడ్కోలు చెప్పేందుకు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని అత‌డు అన్నాడు. ఫామ్‌లో లేని వార్న‌ర్‌ను ఎంపిక చేసి అత‌డిని హీరోని చేస్తున్నార‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. పాకిస్తాన్‌తో ఆరంభమైన మొద‌టి టెస్టులో భారీ శ‌త‌కంతో వార్న‌ర్ స‌త్తా చాట‌డంతో మిచెల్ జాన్సెన్ ను నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. సెంచ‌రీ చేసిన త‌రువాత వార్న‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ జాన్సెన్ ఇది నీకోస‌మే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Out or Not out : ఔటా..? నాటౌటా..? త‌ల‌ప‌ట్టుకున్న అంపైర్లు..! జ‌ర మీరే చెప్పండి సామి..

ట్రెండింగ్ వార్తలు