మహేష్ బాబు సాంగ్ కు చిందులేసి బర్త్ డే విషెష్ చెప్పిన వార్నర్

  • Publish Date - August 10, 2020 / 06:39 AM IST

లాక్ డౌన్ వేళ..ఇంటికే పరిమితమయిన..ఆస్ట్రేలియా క్రికేటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ డేవడ్ వార్నర్ డ్యాన్స్ తో అదరగొడుతున్నాడు. ప్రముఖ నటులు నటించిన సాంగ్స్ కు ఇతను స్టెప్పులు వేస్తూ…డైలాగ్ లతో కూడిన టిక్ టాక్ వీడియోలు చేస్తూ..సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు.



టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా..వార్నర్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేశాడు. తన సతీమణి క్యాండన్ తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు చిందులేశాడు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో #HBDMaheshbabu హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగింది.





ఇక వార్నర్ విషయానికి వస్తే…గత సంవత్సరం ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. 12 మ్యాచ్ లో 692 పరుగులు చేయడంతో పాటు ఒకే మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఇంత చేసినా..సన్ రైజర్స్ తుదిపోరుకు చేరుకోలేకపోయింది.

త్వరలోనే ఐపీఎల్ 13 సీజన్ ప్రారంభమవుతుండడం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి బ్యాట్ ఝులిపించి..హైదరాబాద్ జట్టుకు మరో టైటిల్ అందించాలని అనుకుంటున్నాడు వార్నర్.