IPL 2024 : ఐపీఎల్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్‌ జట్టుకు భారీ షాక్..

ఐపీఎల్ ప్రారంభంకు ముందే లక్నో జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇంగ్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ

David Willey

Lucknow Super Gaints : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) టోర్నీ శుక్రవారం (మార్చి 22) సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ ఏడాదికూడా కేఎల్ రాహుల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బరిలోకి దిగనుంది. అయితే, ఐపీఎల్ ప్రారంభంకు ముందే లక్నో జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇంగ్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడిన డేవిడ్ విల్లీ.. ఐపీఎల్ టోర్నీలో లక్నో తరపున ఆడేందుకు కొద్దిరోజుల క్రితమే భారత్ కు చేరుకున్నాడు.

Also Read : IPL 2024 : రోహిత్, హార్దిక్ కలిసిపోయారు..! వాంఖెడే స్టేడియంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

డేవిడ్ విల్లీ గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. ఈ ఏడాది లక్నో జట్టు డేవిడ్ విల్లీని రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవలే ఇండియాకు వచ్చిన డేవిడ్.. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొన్నాడు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి డేవిడ్ విల్లీ వైదొలిగారని, ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లాడని సమాచారం. ఈ విషయంపై లక్నోప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందిస్తూ.. ఐపీఎల్ మధ్యలో డేవిడ్ విల్లీ తిరిగి మళ్లీ జట్టులో చేరుతాడని అన్నారు. లక్నో జట్టు మార్చి 24న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.

Also Read : పాక్‌ పరువు పాయే..! పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్‌కూ ఆదరణ కరువు

డేవిడ్ విల్లీ గతేడాది నవంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇంగ్లాండ్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్ లలో ఆడతానని విల్లీ పేర్కొన్నాడు. ఈసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతోనే అతడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడని వార్తలు వచ్చాయి.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు