రోహిత్, హార్దిక్ కలిసిపోయారు..! వాంఖెడే స్టేడియంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసిన ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా..

రోహిత్, హార్దిక్ కలిసిపోయారు..! వాంఖెడే స్టేడియంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

hardik pandya and rohit sharma

Rohit Sharma and Hardik Pandya : ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. శుక్రవారం రాత్రి టోర్నీలో తొలి మ్యాచ్ జరగనుంది. అన్నిజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోయారు. ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు వాంఖెడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలు ఒకరినొకరు ఎదురుపడ్డారు. హార్దిక్ రోహిత్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : IPL 2024 : జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఈ ప్లాన్‌లతో ఉచితంగా ట్రిపుల్ డేటా స్పీడ్.. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!

ఐపీఎల్ లో గతకొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. రోహిత్ సారథ్యంలో ముంబై జట్టు ఐదుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది. అయితే, కొద్దినెలల క్రితం జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ ను తప్పించిన యాజమాన్యం.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసి ముంబై జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. దీంతో రోహిత్ ఫ్యాన్స్ తో పాటు ముంబై ఇండియన్ జట్టు ఫ్యాన్స్ సైతం యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ముంబై జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్ధిక్ కు అప్పగించడంపై సోషల్ మీడియా వేదికగా గత రెండు నెలలుగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. రోహిత్ ఫ్యాన్స్ పాండ్యా, ముంబై జట్టు యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఈ అంశంపై ఎక్కడా నోరువిప్పలేదు.

Also Read : పాక్‌ పరువు పాయే..! పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్‌కూ ఆదరణ కరువు

రోహిత్ శర్మ గత మూడు రోజుల క్రితం ముంబై జట్టు సభ్యులతో చేరాడు. ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొంటున్నాడు. అయితే, బుధవారం సాయంత్రం వాంఖెడే స్టేడియంలో జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. రోహిత్ శర్మను చూసిన హార్దిక్ పాండ్యా అతని వద్దకు వెళ్లగా.. హార్దిక్ పాండ్యా రావడంచూసి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని సరదాగా ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముంబై ఇండియన్స్ తొలి నాలుగు మ్యాచ్ ల షెడ్యూల్ ..
మార్చి 24 : గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్ – రాత్రి 7.30 గంటలకు).
మార్చి 27 : సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్, రాత్రి 7.30 గంటలకు)
ఏప్రిల్ 1 : ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ముంబై, రాత్రి 7.30)
ఏప్రిల్ 7 : ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై, మధ్యాహ్నం 3.30)