IND vs SA 2nd Test: భారత్‌పై సాతాఫ్రికా విజయం.. సిరీస్ సమం!
జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

IND vs SA 2nd Test: Dean Elgar
IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 1-1తో సమం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే మాత్రం భారత్ నెక్స్ట్ టెస్టులో విజయం సాధించాలి.
జోహన్నెస్‌బర్గ్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో తొలిసారి ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ముందు టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా సాధించిన ఈ అద్భుత విజయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెప్టెన్ డీన్ ఎల్గర్.
ఈ మైదానంలో దక్షిణాఫ్రికాకు ఇదే అతిపెద్ద పరుగుల వేట. అంతకుముందు, జోహన్నెస్‌బర్గ్‌లో ఎప్పుడూ 240 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేదు. 2018లో ఈ మైదానంలో మ్యాచ్ భారత్ గెలుచుకుంది. డీన్ ఎల్గర్ 188 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. అదే సమయంలో, టెంబా బావుమా కూడా 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 45 బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు, ఎల్గర్ రస్సీ వాన్ డెర్ డస్సెన్‌తో కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. డస్సెన్ 92 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. కీగన్ పీటర్సన్ 28, ఐడెన్ మార్క్రామ్ 31 పరుగులు చేశారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు మాత్రమే చేసింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసి 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని అందించింది.