IND-W vs ENG-W Test : దీప్తిశ‌ర్మ సంచ‌ల‌న స్పెల్‌.. కుప్ప‌కూలిన ఇంగ్లాండ్‌.. భార‌త్‌కు భారీ ఆధిక్యం

IND-W vs ENG-W : భార‌త బౌల‌ర్ దీప్తి శ‌ర్మ సంచ‌ల‌న బౌలింగ్ సెల్ప్‌తో ముంబై వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగింది.

భార‌త బౌల‌ర్ దీప్తి శ‌ర్మ సంచ‌ల‌న బౌలింగ్ సెల్ప్‌తో ముంబై వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది. 5.3 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన దీప్తి శ‌ర్మ ఏడు ప‌రుగులు ఇచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టింది. దీప్తి విజృంభ‌ణ‌తో ఇంగ్లాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 136 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు 292 ప‌రుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అంత‌క ముందు భార‌త జ‌ట్టు త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 428 ప‌రుగులు చేసింది.

ఓవ‌ర్ నైట్ స్కోరు ఏడు వికెట్లు న‌ష్టానికి 410 ప‌రుగుల‌తో రెండో రోజు మొద‌టి ఇన్నింగ్స్‌ ఆట‌ను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 18 ప‌రుగులు ప‌రుగులు మాత్ర‌మే చేసి మిగిలిన మూడు వికెట్ల‌ను కోల్పోయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 60 ప‌రుగుల‌తో బ్యాటింగ్ ఆరంభించిన దీప్తి మ‌రో ఏడు ప‌రుగులు మాత్ర‌మే జోడించి ఎనిమిదో వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకుంది. ఆమె ఔట్ కావ‌డంతో భార‌త మొద‌టి ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు ప‌ట్ట‌లేదు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో లారెన్ బెల్, ఎక్లెస్టోన్ చెరో మూడు వికెట్లు తీశారు. కేట్ క్రాస్, ఛార్లెట్‌ డీన్‌, నాట్ స్కివర్-బ్రంట్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Lionel Messi : మెస్సీనా మ‌జాకానా.. 6 జెర్సీల‌కు రూ.64 కోట్లు

దీప్తి విజృంభ‌ణ‌..

అనంత‌రం ఇంగ్లాండ్ జ‌ట్టు త‌న మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. భార‌త బౌల‌ర్ల ధాటికి ఓపెనర్‌ బ్యూమంట్‌ (10), డంక్లీ (11)లు విఫ‌లం కావ‌డంతో 28 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. నాట్ స్కివర్-బ్రంట్ (59; 70 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించింది. కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (11), డానియల్‌ వ్యాట్‌ (19) ల‌తో పాటు మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవ‌ర్ల‌లో 136 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ్ ఐదు వికెట్ల‌తో ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించ‌గా.. స్నేహ్‌ రాణా రెండు వికెట్లు తీసింది. పూజా వస్త్రకార్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

IND vs SA T20 Match : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఉత్తమ ఫీల్డర్ పతకాన్నిఅందుకున్న హైదరాబాదీ క్రికెటర్..

భారీ ఆధిక్యం ద‌క్కిన‌ప్ప‌టికీ ఇంగ్లాండ్‌ను పాలోఆన్ ఆచించ‌కుండా భార‌త్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.

అరుదైన రికార్డు..

ఈ మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హాప్ సెంచ‌రీతో పాటు ఐదు వికెట్లు తీసిన రెండో భార‌త ప్లేయ‌ర్‌గా నిలిచింది. అంత‌క‌ముందు 1985లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శుభంగి కులకర్ణి 79 పరుగులు చేయ‌డంతో 6 వికెట్లు తీసింది.

ట్రెండింగ్ వార్తలు