బయటకు పోనివ్వండి..లేకపోతే ప్యాంటులో పోస్తా

Denis Shapovalov : ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓ ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు డెనీస్ షాపోలపోవ్, జన్నిక్ సిన్నర్ తో మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే నాలుగు సెట్ లు ఆడి..ఐదో సెట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో..తాను బయటకు వెళ్లాలని అనుకుంటున్నట్లు, టాయిలెట్ కు వెళ్లాలని అంపైర్ ను అడిగాడు డెనీస్. కానీ..అందుకు అంపైర్ అనుమతినివ్వలేదు. దీంతో డెనీస్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

టాయిలెట్ కు వెళ్లనివ్వలేకపోతే..ప్యాంటులోనే పోసేలా ఉన్నా..లేదంటే..బాటిల్ లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్ కు కూడా వెళ్లనివ్వరా ? అంటూ ఒకింత కోపం ప్రదర్శించాడు. ఇదెక్కడి రూల్ అంటూ ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐదో సెట్ ప్రారంభానికి కంటే ముందు..ఈ ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ సెట్ నుంచే..ఇరువురి మధ్య హోరాహోరి ఆట కొనసాగింది. 3-6, 6-3,6-2,4-6,6-4తో డెనీస్‌ విజయం సాధించాడు.