Dhanashree Verma, Yuzvendra Chahal Dance
Dhanashree Verma, Yuzvendra Chahal Dance : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ వివాహ బంధానికి శుక్రవారంతో మూడేళ్లు అయింది. ఈ సందర్భంగా ధనశ్రీ వర్మ భర్త చాహల్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ 2020 డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ధనశ్రీ వర్మ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. భార్యాభర్తలు ఇద్దరూ నిత్యం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ధనశ్రీ.. చాహల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Chahal : ప్రదర్శనతోనే సెలక్టర్లను ప్రశ్నిస్తున్న చాహల్..! జట్టులో తనకు చోటు ఎందుకు లేదని..?
నేను ఆట పట్టించాలనుకునే ఏకైక వ్యక్తి నా భర్త చాహల్. మూడేళ్లుగా ఒకరికొకరం అండగా ఉంటున్నాం. వీలు చిక్కినప్పుడల్లా మిస్టర్ చాహల్ తో కలిసి డ్యాన్స్ చేస్తా. ఈరోజుకూడా మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేశాం. వార్షికోత్సవ శుభాకాంక్షలు యుజ్వేంద్ర చాహల్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వారిద్దరి డ్యాన్స్ వీడియోను ధనుశ్రీ పోస్టు చేశారు.
Also Read : Yuzvendra Chahal : ధనశ్రీ ఫోటోలపై చహల్ వ్యాఖ్యలు వైరల్.. ‘నా తాజ్ మహల్..’
మూడేళ్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో భార్యతో కలిసిఉన్న ఫొటోలను చాహల్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా భార్య గురించి చాహల్ సక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియమైన భార్య.. మేము కలిసిన మొదటిరోజు నుంచి ఈ క్షణం వరకు, ఈ ప్రయాణంలో ప్రతి సెకను నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. స్వర్గంలో పెళ్లిళ్లు ఫిక్స్ అవుతాయని అంటుంటారు. మా స్క్రిప్ట్ ను రాసిన వారు నా పక్షాన ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని చాహల్ అన్నారు. నువ్వు నన్ను ప్రతిరోజ మంచి మనిషిగా మారుస్తావు.. నువ్వు నన్ను పూర్తి చేశావు.. నా జీవితపు ప్రేమ.. మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ చాహల్ పేర్కొన్నారు.
యుజ్వేంద్ర చాహల్ కు టీమిండియా తుది జట్టులో కొంతకాలంగా చోటు దక్కడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా 33ఏళ్ల స్పిన్నర్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో చర్చనీయంగా మారుతున్నాడు. వన్డే ప్రపంచ వరల్డ్ కప్ లో చాహల్ కు చోటు దక్కలేదు.. ఆ తరువాత స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్ లో జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల దక్షిణాఫ్రికా దేశంలో ఆ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు జట్టులో చోటు దక్కినప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం చాహల్ కు రాలేదు.