Dhoni fan : ధోనీ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య‌.. త‌న ఇంటినే సీఎస్‌కే రంగుల‌తో నింపిన వ్య‌క్తి..

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Dhoni fan Is no more

Dhoni fan Is no more : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే.. వీరిలో చెన్నైకి చెందిన గోపీ కృష్ణ‌న్ (34) మాత్రం చాలా ప్ర‌త్యేకం.ఇత‌డు ధోనికి వీరాభిమాని. త‌న ఇంటికి చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌ల‌ర్స్ వేసుకోవ‌డంతో పాటు గోడ‌ల‌పై సీఎస్‌కే లోగోలు, ధోని చిత్రాల‌ను వేయించాడు. అప్ప‌ట్లో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇత‌డు ఆత్మ‌హత్య చేసుకున్నాడు.

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని క‌డ‌లూరు జిల్లా అరంగూర్‌లోని త‌న నివాసంలో తెల్ల‌వారుజామున బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం పై కృష్ణ‌న్ సోద‌రుడు రామ్ మాట్లాడుతూ.. త‌న సోద‌రుడికి పొరుగు గ్రామంలో కొంత మంది వ్య‌క్తుల‌తో ఆర్థిక వివాదాలు ఉన్న‌ట్లుగా చెప్పాడు. ఇటీవ‌ల ఇదే విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. కొంద‌రు అత‌డిపై దాడి చేశారు. ఈ క్ర‌మంలో అత‌డికి ప‌లు గాయాలైన‌ట్లు వెల్ల‌డించాడు. దీంతో అత‌డు తీవ్ర మ‌న‌స్తాపం చెందిన‌ట్లుగా రామ్ అన్నారు.

అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కుటుంబ స‌భ్యులు కోరుతున్నారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. మృతుడు గోపికృష్ణ‌కు భార్య అన్బ‌ర‌సి, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. 10 రోజుల క్రిత‌మే అత‌డికి ఆడ‌పిల్ల జ‌న్మించింది.

దుబాయ్ నుంచి వ‌చ్చి..

గోపికృష్ణ‌న్ దుబాయ్‌లో ప‌నిచేసేవాడు. 2020లో స్వ‌గ్రామానికి వ‌చ్చిన అత‌డు కెప్టెన్ కూల్ పై ఉన్న అభిమానంతో త‌న ఇంటికి సీఎస్ కే జెర్సీ క‌ల‌ర్ అయిన ప‌సుపు రంగును వేయించాడు. అంతేనా.. గోడ‌ల‌కు సీఎస్‌కే లోగోతో పాటు ధోని ఫోటోల‌ను వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారగా.. ఈ విష‌యం ధోని వ‌ర‌కు చేరింది. ధోని అత‌డిని ప్ర‌త్యేకంగా అభినందించాడు. కాగా.. అప్ప‌టి నుంచి అత‌డి ఇంటిని ప‌లువురు సెల‌బ్రెటీల‌తో పాటు ధోని అభిమానులు సంద‌ర్శించి ఫోటోలు తీసుకునేవారు.

ట్రెండింగ్ వార్తలు