Site icon 10TV Telugu

MS Dhoni : వ‌చ్చే సీజ‌న్ ఆడ‌తారా..? ఫ్యాన్స్ ప్ర‌శ్న‌కు ధోని హిలేరియ‌స్ స‌మాధానం.. వీడియో వైర‌ల్‌..

Dhoni hilarious response to fan request to play IPL 2026

Dhoni hilarious response to fan request to play IPL 2026

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంత‌ర్జాయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. అయిన‌ప్ప‌టికి అత‌డి క్రేజ్ త‌గ్గ‌లేదు. ఇదిలా ఉంటే.. గ‌త రెండు మూడేళ్లుగా అత‌డు ఐపీఎల్ నుంచి రిటైర్‌ అవుతాడు అంటూ ప్ర‌తి సీజ‌న్‌కు ముందు వార్త‌లు వ‌స్తూనే ఉండ‌గా.. ధోని మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతూ వాటికి చెక్ పెడుతున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌తాడా? లేదా? అనే దానిపై ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త లేదు.

ఇక ఈ విష‌యం పై ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ధోని స్పందించాడు. మీరు ఐపీఎల్ 2026లో ఆడాల‌ని అని  కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఓ అభిమాని ధోనిని కోరాడు. దీనిపై 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత కెప్టెన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 తాను ఆడతానో లేదో తెలియ‌ద‌ని చెప్పాడు. దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నాడు. వ‌చ్చే సీజ‌న్‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌న్నాడు. ఇప్పుడే చెప్ప‌డం తొంద‌ర‌పాటే అవుతుంద‌న్నాడు. త‌న‌ మోకాలు నొప్పిగా ఉంద‌ని, దానిని ఎవ‌రు భ‌రిస్తారు అని ధోని స‌ర‌దాగా అన్నాడు. దీంతో అక్క‌డ న‌వ్వులు విరిశాయి.

Suryakumar Yadav : ఆసియాక‌ప్ 2025కు నెల‌రోజులు కూడా లేదే.. సూర్య కుమార్‌ ఫుల్ ఫిట్‌నెస్‌తో లేడా?

కాగా.. ధోని చెప్పిన స‌మాధానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Rohit Sharma : ల‌గ్జ‌రీ కారును కొన్న రోహిత్ శ‌ర్మ.. ధ‌ర తెలుస్తే షాకే.. 3015 నంబ‌ర్ ప్లేట్ వెనుక ఉన్న అస‌లు క‌థ అదేనా..

ఐపీఎల్ 2023 సీజ‌న్ నుంచి ధోని మోకాలి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఆ సీజ‌న్ ముగిసిన వెంట‌నే అత‌డు శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. కాగా.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ‌డంతో ధోని తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఈ క్ర‌మంలో కొత్త సీజ‌న్ కోసం కొత్త సార‌థి వైపు చెన్నై చూస్తోంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Exit mobile version