ఆ ఒక్క పరుగు చేయకుండానే భారత్ గెలిచిందా

భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్‍లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Publish Date - January 16, 2019 / 07:03 AM IST

భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్‍లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అడిలైడ్: మ్యాచ్‌కు ముగింపు పలకటంలో ధోనీ దిట్ట! మంచి మ్యాచ్ ఫినిషర్ అంటూ ప్రశంసలు అందుకునే దనాదన్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ అడిలైడ్ వేదికగా లక్ష్యాన్ని చేధించడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు విజయం తర్వాత ఫార్మాట్ మార్చుకుని బరిలోకి దిగిన టీమిండియా తొలి వన్డేను 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో రెండో వన్డేను విజయంతో ముగించి సిరీస్‌లో ఫలితాన్ని సమం చేయాలని ఆరాటపడిన భారత్ ఎట్టకేలకు 1-1తో ముగించినట్లుగా అంపైర్లు తేల్చారు.

కానీ, అనూహ్యంగా మ్యాచ్ అనంతరం.. భారత్ ఖాతాలో ఒక పరుగు చేరి ఉండాల్సింది కాదంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్‍లోనే భారత్ ఖాతాలో ఓ పరుగు తప్పుగా దొర్లిందంటూ వీడియోతో సహా పోస్టు చేసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో విజయాన్ని చేరుకోవాలంటే 31 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో నాథన్ లయన్ 45వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ధోనీ పరుగు తీసే క్రమంలో పొరబాటుపడ్డాడు. ఆ తప్పిదాన్ని అంపైర్లు కూడా గమనించకపోవడంతో అతని ఖాతాలో ఒక పాయింటు వచ్చిచేరింది. 

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించాడు. 299 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి విజయాన్ని సాధించింది. ఇలా 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో కోహ్లీసేన విజయాన్ని అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు