IPL 2021 : చిన్నారులను థ్రిల్ చేసిన మిస్టర్ కూల్ ధోనీ

మైదానంలోనే కాకుండా..బయట కూడా కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ..ఇద్దరు చిన్నారులకు సర్ ఫ్రైజ్ ఇచ్చారు.

Dhoni

Dhoni Gift : మైదానంలోనే కాకుండా..బయట కూడా కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ..ఇద్దరు చిన్నారులకు సర్ ఫ్రైజ్ ఇచ్చారు. స్టాండ్ లో ఉన్న వారికి బంతిని అందించారు. ఆ బంతిపై ఆటోగ్రాఫ్ చేసి మరీ ఇచ్చారు. దీంతో ఆ చిన్నారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కింద ఉన్న ధోనీ..వారికి బంతిని పైకి ఎగిరేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More : T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు -షాహిద్ అఫ్రిది

ఐపీఎల్ 2021 మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీతో క్వాలిఫయిర్ -1 మ్యాచ్ లో చెన్నై జట్టు ఢీకొంది. ఈ మ్యాచ్ లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును ఫైనల్ లోకి చేర్చిన ధోనీపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. చివరి ఓవర్ లో ధోనీ చెలరేగిపోయాడు. ఏకంగా..మూడు బౌండరీలు కొట్టి ధనాధన్ అనిపించుకున్నాడు. 6 బంతుల్లో…18 రన్స్ చేశాడు.

Read More : IPL 2021 CSK Vs DC : రెచ్చిపోయిన రుతురాజ్.. ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

ఆదివారం రాత్రి దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఈ మ్యాచ్ ను తిలకించారు. స్టాండ్స్ లో ఉన్న వారు కూడా ఈ మ్యాచ్ ను చూశారు. చూస్తున్న వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అద్బుత క్షణాలను ధోనీ ఎంజాయ్ చేశాడు. ఎల్లో దుస్తుల్లో ఉన్న వారు..మ్యాచ్ అయిపోయిన అనంతరం తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఆనందం తట్టుకోలేని చిన్నారి…కన్నీళ్లు పెట్టుకుంది.

Read More : IPL 2021: ఫైనల్ కోసం పోరాటం – గెలిచేదెవరు.. నిలిచేదెవరు??

ఈ విషయం ధోనీకి తెలిసింది. దీంతో బాల్ పై ఆటోగ్రాఫ్ చేసి…కూర్చొన్న వారి వద్దకు వచ్చారు. బంతిని పైకి విసిరేశాడు. బాల్ అందుకున్న వారు ఫుల్ ఖుష్ అయిపోయారు. పిల్లల మనస్సు దోచుకున్న మిస్టర్ కూల్ పై మాజీ క్రికేటర్ వాసీమ్ జాఫర్ కామెంట్ చేశారు. యువతరానికి ధోనీ ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు.