Chris Gayle Starts Training, Hints At Returning In The Ipl In 2023
Chris Gayle: ఐపీఎల్ 2022లో క్రికెట్ అభిమానులు మిస్ అవుతున్న ప్లేయర్లలో క్రిస్ గేల్ ఒకరు. ఈ వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట టోర్నమెంట్ చరిత్రలో కొన్ని రికార్డులు నమోదై ఉన్నాయి. ఐపీఎల్ 2022 వేలానికంటే ముందే తాను సీజన్ కు అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు. కొన్ని సీజన్లుగా తనకు టోర్నమెంట్ లో సరైన గౌరవం దక్కడం లేదని తెలిపాడు.
“రెండు సీజన్లుగా నాకు సరైన మర్యాద దక్కలేదని అనిపించింది. ఐపీఎల్ కోసం, స్పోర్ట్ కోసం ఎంత చేసినా సరైన గౌరవం లభించలేదని తెలిసింది. అందుకే సరేనని చెప్పి ఆడకుండా పక్కకు పెట్టే ప్లేయర్ల జాబితాలో ఉండకూడదని నిర్ణయించుకున్నా. క్రికెట్ తర్వాత అందరికీ ఒక జీవితం ఉంటుంది. సాధారణ జీవితాన్ని అలవరచుకోవడానికే ప్రయత్నిస్తున్నా”
“వచ్చే ఏడాది నేను తిరిగొస్తా. వాళ్లకు నా అవసరం ఉంది. ఐపీఎల్ లో కోల్ కతా, ఆర్సీబీ, పంజాబ్ మూడు జట్లకు ఆడా. ఆర్సీబీ, పంజాబ్ లలో ఆడినప్పుడు టైటిల్ వస్తుందని అనుకున్నా. ఐపీఎల్ లో మంచి సక్సెస్ సాధించా. ఛాలెంజెస్ నాకు బాగా ఇష్టం” అని గేల్ వివరించాడు.
Read Also: క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్
క్రిస్ గేల్ ఐపీఎల్ లో 142మ్యాచ్ లు ఆడి 4వేల 965పరుగులు చేశాడు. అందులో 6సెంచరీలు కూడా ఉన్నాయి.