Dinesh Karthik: పెళ్లిరోజున భార్యను ఉద్దేశిస్తూ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ వైరల్.. ఏమన్నాడంటే?

టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా తన భార్యను ఉద్దేశిస్తూ సందేశాన్ని పంచుకున్నాడు.

Dinesh Karthik

Dinesh Karthik Tweet Viral: టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా తన భార్యను ఉద్దేశిస్తూ సందేశాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2015లో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ని దినేశ్ కార్తీక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది పెళ్లిరోజు కావటంతో దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలైనా.. ఎన్ని సమస్యలు ఎదురైనా నిజమైన ప్రేమ మనుగడ సాగిస్తోంది.. హ్యాపీ డీకే-డీపీ డే’ అని పేర్కొన్నాడు.

దినేశ్ కార్తీక్ ప్రస్తుతం భారత్ జట్టులో లేడు. గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమి తరువాత అతను భారత్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దినేశ్ కార్తీకు 38ఏళ్లు. భారత జట్టు తరపున 26 టెస్టులు, 94 వన్డేలు ఆడాడు. 56 టీ20 మ్యాచ్ లలోనూ దినేశ్ కార్తీక్ ఆడాడు. అన్ని ఫార్మాట్లలోనూ 3వేల కంటేఎక్కువ పరుగులు సాధించాడు.