Hanuma Vihari Single Hand Batting
Hanuma Vihari : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హనుమ విహారి సింగిల్ హ్యాండ్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్ తో జరిగిన రంజీట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్లో హనుమ అసమాన పోరాట స్ఫూర్తిని కనబరిచాడు. విహారి ఆడిన ఓ షాట్ ను వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రివర్స్ స్లాప్ గా ట్విటర్ లో వర్ణించాడు. మ్యాచ్ మొదటి ఇన్నింగ్ లో మణికట్టుకు గాయం కావడంతో విహారి మైదానాన్ని వీడాడు.
Hanuma Vihari’s Reverse Slap
Dinesh Karthik
It’s a REVERSE SLAP not a
reverse sweep ?
No offence to the bowler, but that was quite a shot https://t.co/iNjDjxPJsL
— DK
(@DineshKarthik) February 3, 2023
అయితే జట్టు కోసమే తాను ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని హనుమ విహారి వెల్లడించాడు. పోరాట స్ఫూర్తిని వదులుకోవద్దని సలహాయిచ్చాడు. తనకు అండగా నిలబడిన వారందరికీ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా, రంజీట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్రప్రదేశ్ ఓడిపోయినప్పటికీ హనుమ విహారి అసమాన పోరాటాన్ని సోషల్ మీడియాలో నెటిజనులు ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచుల్లో హనుమ విహారి ఆటను మిస్సవుతున్నామని అంటున్నారు. గాయంతో విహారి బ్యాటింగ్ చేయడం ఇది మూడోసారి అని క్రీడాభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
Read Also : Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్.. డిశ్చార్జి ఎప్పుడంటే