T20 Leagues in 2024: ఏడాదంతా పొట్టి క్రికెట్ జాతర.. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్‌ లీగ్‌ ఏదో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

T20 Leagues in 2024

T20 Leagues : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ దశనే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా టీ20 మానియా పట్టుకుంది. దీంతో ఐపీఎల్ తరహా టీ20 లీగ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాలుగైదు ఫ్రాంచైజీలను పుట్టించడం అంతర్జాతీయ ప్లేయర్స్ మధ్య మ్యాచ్ లు నిర్వహించడం సర్వసాధారణమైంది. దీంతో ఈ ఏడాదంతా క్రికెట్ ప్రేమికులకు పండగనే చెప్పొచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఐసీసీ టీ20 టోర్నీ, టీ20 సిరీస్ లే కాకుండా 10 లీగ్ టోర్నీలు జరగనున్నాయి. అదికూడా బ్యాక్ టూ బ్యాక్ ఉండటం విశేషం. ఫలితంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు క్రికెట్ ప్రేమికులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది.

Also Read : T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్..!

బిగ్ బాష్ లీగ్ 2024 ప్రారంభానికి ముందే ప్రారంభమైంది. ఈనెల చివరి వరకు ఈ సీజన్ నడుస్తోంది. జనవరి 9నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు సౌతాఫ్రికా వేదికగా ఎస్ఎ టీ20 జరగనుంది. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్ లీగ్ ఇదే. ఈ ఏడాది చివరిలో బిగ్ భాష్ లీగ్ (బీబీఎల్) ఆస్ట్రేలియాలో జరుగుతుంది. డిసెంబర్ నెలలో ఇది ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి నెల చివరి వరకు జరుగుతుంది. ఈ మధ్యలో పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ క్రికెట్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇలా బోలెడన్ని టీ20 లీగ్ లు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాదంతా క్రికెట్ ప్రేమికులకు సందడే సదడి.

Also Read : First Hat trick : క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి హ్యాట్రిక్ తీసింది ఈరోజే.. ఆ బౌల‌ర్ ఎవ‌రో మీకు తెలుసా..?

టీ20 లీగ్ ల షెడ్యూల్ ఇలా ..

  • దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఎ 20 (జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది)
  • యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది)
  • బంగ్లాదేశ్ లో జరిగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్).. (జనవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరుగుతుంది)
  • పాకిస్థాన్ లో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) .. (ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19 వరకు జరుగుతుంది)
  • భారత్ లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. (మార్చి 26 నుంచి మే 26వ తేదీ వరకు జరుగుతుంది).. అయితే అధికారికంగా తేదీలు ఖరారు కాలేదు.
  • ఇంగ్లండ్ లో వైటాలిటీ బ్లాస్ట్ (మే 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరుగుతుంది)
  • అమెరికా, వెస్టిండీస్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ (జూన్ 4 నుంచి జూన్ 30వ తేదీ వరకు జరుగుతుంది)
  • అమెరికాలో జరిగే మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్సీ) .. జూలై నెలలో జరుగుతుంది.
  • ఇంగ్లాండ్ లో జరిగే ద హండ్రెడ్ లీగ్ (ఆగస్టు నెలలో జరుగుతుంది).
  • వెస్టిండీస్ లో జరిగే కరేబియన్ ప్రిమియర్ లీగ్ (సీపీఎల్).. (ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెల వరకు జరుగుతుంది)
  • యూఏఈలో జరిగే టీ10 లీగ్ (అక్టోబర్ నెలలో జరుగుతుంది)
  • ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ భాష్ లీగ్ (బీబీఎల్).. డిసెంబర్ – వచ్చే ఏడాది జనవరి నెలలో జరుగుతుంది)

 

 

 

ట్రెండింగ్ వార్తలు