First Hat trick : క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి హ్యాట్రిక్ తీసింది ఈరోజే.. ఆ బౌల‌ర్ ఎవ‌రో మీకు తెలుసా..?

క్రికెట్‌లో మొట్ట మొద‌టి సారి హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌల‌ర్ ఎవ‌రు..?

First Hat trick : క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి హ్యాట్రిక్ తీసింది ఈరోజే.. ఆ బౌల‌ర్ ఎవ‌రో మీకు తెలుసా..?

Fred Spofforth

First Hat trick : క్రికెట్‌లో హ్యాట్రిక్‌కు ఉండే క్రేజే వేరు. బ్యాట‌ర్లు వ‌రుస‌గా బౌండ‌రీలు కొట్ట‌డం చాలా సంద‌ర్భాల్లో చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ బౌల‌ర్ హ్యాట్రిక్ వికెట్లు తీయ‌డం చాలా అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ చ‌రిత్ర‌లో చాలా త‌క్కువ మంది బౌల‌ర్లు మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు. మ‌రీ మీరు ఎప్పుడైన ఆలోచించారా..? క్రికెట్‌లో మొట్ట మొద‌టి సారి హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌల‌ర్ ఎవ‌రు..? అత‌డు ఏ దేశానికి చెందిన వాడో..? అన్న విష‌యాలు ఇప్పుడు చూద్దాం.

క్రికెట్‌లో మొట్ట‌మొద‌టి సారిగా హ్యాట్రిక్ వికెట్లు తీసిన రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గ‌జ ఆట‌గాడు ఫ్రెడరిక్‌ స్పోఫోర్త్ పేరిట ఉంది. అత‌డు ఇంగ్లాండ్ జ‌ట్టు పై ఈ ఘ‌న‌త సాధించాడు. కాగా.. అది కూడా ఈ రోజు (అంటే జ‌న‌వ‌రి 2నే ) కావ‌డం విశేషం.

Sledging : ఈ యువ కెప్టెన్ మాట‌లు విన్నారా..? చిన్నోడే గానీ మ‌హాముదురు..!

మెల్‌బోర్న్ వేదిక‌గా 1879 జ‌న‌వ‌రి 2వ తేదీన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఫ్రెడరిక్ ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూయించాడు. వ‌రుస‌గా వెమోన్‌ రాయల్‌, ఫ్రాన్సిస్‌ మెక్‌కిన్నన్‌, టామ్‌ ఎమ్మెట్ ల‌ను ఔట్ చేసి తొలి హ్యాట్రిక్ సాధించిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 25 ఓవ‌ర్లు వేసిన ఫ్రెడరిక్ 48 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచులో 13 వికెట్లతో రాణించి ఆస్ట్రేలియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

10 ఏళ్ల కెరీర్‌.. 18 మ్యాచులు..

ఫ్రెడరిక్ 1877 నుంచి 1887 వ‌ర‌కు క్రికెట్ ఆడాడు. 10 ఏళ్ల  కెరీర్‌లో 18 టెస్టు మ్యాచులే ఆడాడు. 94 వికెట్లు సాధించాడు. ఏడు సార్లు ఐదు వికెట్లు ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేశాడు. 1926లో ఆయ‌న చ‌నిపోయారు. 1996లో క్రికెట్ ఆస్ట్రేలియా, 2009లో ఐసీసీ లు హాల్‌ ఆఫ్‌ ఫేమ్ గుర్తింపునిచ్చాయి.

Poor Fielding : మీ దుంప తెగ‌.. ఒక్క బాల్‌కే ఐదు ప‌రుగులు ఇచ్చారు గ‌దా.. మీకంటే గ‌ల్లీ ఫీల్డ‌ర్లు న‌యం..!

కాగా.. టెస్టుల్లో తొలిసారి హ్యాట్రిక్ తీసింది ఫెడ‌రిక్ అయితే.. వ‌న్డేల్లో పాకిస్తాన్‌కు చెందిన జ‌లాల్ ఉద్ దిన్ ఈ ఘ‌న‌త సాధించాడు. 1982లో ఆస్ట్రేలియాపై అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఇక టీ20ల విష‌యానికి వ‌స్తే ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు బ్రెట్ లీ 2007లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచులో ఈ ఘ‌న‌త అందుకున్నాడు.