Poor Fielding : మీ దుంప తెగ‌.. ఒక్క బాల్‌కే ఐదు ప‌రుగులు ఇచ్చారు గ‌దా.. మీకంటే గ‌ల్లీ ఫీల్డ‌ర్లు న‌యం..!

యూరోపియ‌న్ క్రికెట్ ఛాంపియ‌న్‌షిప్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Poor Fielding : మీ దుంప తెగ‌.. ఒక్క బాల్‌కే ఐదు ప‌రుగులు ఇచ్చారు గ‌దా.. మీకంటే గ‌ల్లీ ఫీల్డ‌ర్లు న‌యం..!

Poor Fielding in European Cricket

Poor Fielding in European Cricket : సాధార‌ణంగా క్రికెట్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణించిన జ‌ట్లు మ్యాచులు గెలుస్తూ ఉంటాయి. ఫీల్డింగ్ అనేది చాలా ముఖ్య‌మైన‌ది. అందుక‌నే క్యాచులు మ్యాచుల‌ను గెలిపిస్తాయ‌ని త‌రుచుగా చెబుతుంటారు. అద్భుత బ్యాటింగ్‌, మంచి బౌలింగ్ చేసిన‌ప్ప‌టికీ ఫీల్డింగ్ నాసిర‌కంగా ఉంటే మ్యాచులు గెల‌వ‌డం చాలా క‌ష్టం. కాబ‌ట్టి మాజీ ఆట‌గాళ్లు ఫీల్డింగ్ అనేది ఎంత ముఖ్య‌మో త‌ర‌చుగా చెబుతుంటారు.

తాజాగా యూరోపియ‌న్ క్రికెట్ ఛాంపియ‌న్‌షిప్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి బ్యాట‌ర్ షాట్ ఆడ‌గా ఆ బాల్.. ఫైన్ లెగ్ దిశ‌గా వెళ్లింది. అక్క‌డ ఎవ‌రు ఫీల్డ‌ర్లు లేక‌పోవ‌డంతో కీప‌ర్ బాల్ వెనుక ప‌రిగెత్తాడు. బంతి బౌండ‌రీ ద‌గ్గ‌ర‌లో ఆగిపోయింది. బాల్‌ను అందుకున్న కీప‌ర్ వికెట్ల వైపుకు విసిరేశాడు. అప్ప‌టికే బ్యాట‌ర్లు మూడు ప‌రుగులు పూర్తి చేసి నాలుగో ప‌రుగు తీస్తున్నారు.

Shahid Afridi : అల్లుడి ఇజ్జ‌త్ తీసిన మామ‌..! షాహీన్ అఫ్రిది టీ20 కెప్టెన్ ఎలా అయ్యాడో చెప్పిన షాహిద్ అఫ్రిది

వికెట్ల‌కు కొంచెం దూరంగా వ‌చ్చిన బంతిని అందుకున్న ఓ ఫీల్డ‌ర్‌ బ్యాట‌ర్‌ను ర‌నౌట్ చేయాల‌ని భావించాడు. వెంట‌నే స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపుగా బాల్ విసిరేశాడు. బంతిని వికెట్ల తాక‌లేదు స‌రిక‌దా అక్క‌డ ఏ ఫీల్డ‌ర్ ప‌ట్టుకోక‌పోవ‌డంతో కొంచెం దూరంగా వెళ్లింది. అప్ప‌టికే నాలుగో ప‌రుగు పూర్తి చేసిన బ్యాట‌ర్లు.. నిదానంగానే ఐదో ప‌రుగును తీశారు.

కాగా.. ఫీల్డ‌ర్ల అల‌స‌త్వం కార‌ణంగా ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్లు ఐదు ప‌రుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. మీ దుంప తెగ‌.. మీ కంటే గ‌ల్లీ ఫీల్డ‌ర్లు న‌యం క‌దా అని అంటున్నారు.

Virat Kohli : 2024లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే.. వీటిలో ఎన్ని బ‌ద్ద‌లు కొడ‌తాడో..!