Shahid Afridi : అల్లుడి ఇజ్జ‌త్ తీసిన మామ‌..! షాహీన్ అఫ్రిది టీ20 కెప్టెన్ ఎలా అయ్యాడో చెప్పిన షాహిద్ అఫ్రిది

టీ20ల్లో షాహీన్ అఫ్రిది కి కెప్టెన్సీ ఇవ్వ‌డంపై అత‌డి మామ‌, మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Shahid Afridi : అల్లుడి ఇజ్జ‌త్ తీసిన మామ‌..! షాహీన్ అఫ్రిది టీ20 కెప్టెన్ ఎలా అయ్యాడో చెప్పిన షాహిద్ అఫ్రిది

Shaheen Afridi-Shahid Afridi

Shaheen Afridi – Shahid Afridi : భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న చాలా ఘోరంగా ఉంది. ఈ మెగా టోర్నీలో తొమ్మిది మ్యాచులు ఆడిన పాకిస్తాన్ నాలుగు మ్యాచుల్లో మాత్ర‌మే గెలిచింది. పాయింట్ల పట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీస్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. దీంతో కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ ఆజాం త‌ప్పుకున్నాడు. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ మార్పులు చేప‌ట్టింది. టెస్టుల్లో షాన్ మ‌సూద్‌కు టీ20ల్లో షాహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అయితే.. టీ20ల్లో షాహీన్ అఫ్రిది కి కెప్టెన్సీ ఇవ్వ‌డంపై అత‌డి మామ‌, మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త్వ‌ర‌లోనే పాకిస్తాన్ జ‌ట్టు షాహీన్ నాయ‌క‌త్వంలో న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. దీనిపై అఫ్రిది మాట్లాడుతూ.. షాహీన్‌కు బ‌దులుగా మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు టీ20 కెప్టెన్సీ ఇస్తే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఓ ఆట‌గాడిగా రిజ్వాన్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌న్నాడు. ఆట ప‌ట్ల అత‌డికి ఉన్న అంకిత భావం, క‌ఠిన శ్ర‌మనే అత‌డిని అత్యుత్త‌మ ఆట‌గాడిగా చేశాయ‌న్నారు.

Virat Kohli : 2024లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే.. వీటిలో ఎన్ని బ‌ద్ద‌లు కొడ‌తాడో..!

అత‌డు ఆట‌పై మాత్ర‌మే దృష్టిని పెడుతాడ‌ని, ప‌క్క వారి గురించి ఆలోచించ‌డ‌న్నారు. త‌న నైపుణ్యాల‌ను చాలా చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంటాడ‌ని, అత‌డొక యోధుడు అని రిజ్వాన్‌ను అఫ్రిది ప్ర‌శంసించాడు. అందుక‌నే తాను రిజ్వాన్‌ను టీ20 కెప్టెన్‌గా చూడాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. అయితే.. షాహీన్ పొర‌పాటున‌ కెప్టెన్ అయ్యాడు అంటూ న‌వ్వుతూ చెప్పాడు. అఫ్రిది మాట్లాడిన ఈ వీడియో నెటింట్ట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. సొంత అల్లుడి ఇజ్జ‌త్ తీసావు గ‌దా అని అంటున్నారు. కాగా.. షాహిద్‌ కుమార్తె అన్షాను షాహీన్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

కాగా.. పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ జ‌న‌వ‌రి 3 నుంచి సిడ్నీ వేదిక‌గా ప్రారంభం కానున్న మూడో టెస్టులో విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌లగా ఉంది. ఆసీస్ ప‌ర్య‌ట‌న అనంత‌రం పాక్‌.. న్యూజిలాండ్‌కు వెళ్ల‌నుంది. కివీస్‌తో షాహీన్ అఫ్రిది నాయ‌క‌త్వంలో పాక్‌ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 14 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది.

David Warner : అదృష్టం అంటే వార్న‌ర్‌దే..! అలా వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌గానే.. ఇలా టీ20ల‌కు కెప్టెన్‌గా