David Warner : అదృష్టం అంటే వార్న‌ర్‌దే..! అలా వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌గానే.. ఇలా టీ20ల‌కు కెప్టెన్‌గా

కొత్త ఏడాది తొలి రోజునే అభిమానుల‌కు షాకిచ్చాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌.

David Warner : అదృష్టం అంటే వార్న‌ర్‌దే..! అలా వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌గానే.. ఇలా టీ20ల‌కు కెప్టెన్‌గా

Dubai Capitals announce David Warner as captain

Dubai Capitals captain David Warner : కొత్త ఏడాది తొలి రోజునే అభిమానుల‌కు షాకిచ్చాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. వన్డే క్రికెట్‌కు వీడ్కొలు ప‌లికిన‌ట్లు వెల్ల‌డించాడు. ఇప్ప‌టికే ఈ ఫార్మాట్‌లో ఆఖ‌రి మ్యాచ్ ఆడేసిన‌ట్లు వెల్ల‌డించాడు. గ‌త ఏడాది భార‌త్‌లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచే త‌న‌కు వ‌న్డేల్లో చివ‌రిది అని చెప్పి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. ఇక మ‌రో వారం రోజుల్లో టెస్టుల నుంచి త‌ప్పుకోనున్నాడు. జ‌న‌వ‌రి మూడు నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచే వార్న‌ర్ కెరీర్‌లో ఆఖ‌రి అంత‌ర్జాతీయ టెస్టు మ్యాచ్ కానుంది.

ఈ క్ర‌మంలో వార్న‌ర్ స‌రికొత్త బాధ్య‌త‌లు అందుకోనున్నాడు. జ‌న‌వ‌రి 20 నుంచి ఫ్రిబ్ర‌వ‌రి 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20 (ILT20) లో దుబాయ్ క్యాపిట‌ల్స్ కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని స‌ద‌రు ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిచింది. కెప్టెన్ మార్వెల్ అంటూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు అనుబంధ జ‌ట్టు దుబాయ్ క్యాపిట‌ల్స్ అన్న సంగ‌తి తెలిసిందే.

Brisbane International : టెన్నిస్ కోర్టులో విష‌పూరిత పాము.. భ‌య‌ప‌డిన ఆట‌గాళ్లు.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

టీమ్ఇండియా యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ‌డంతో వార్న‌ర్‌ ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. 14 మ్యాచుల్లో 516 ప‌రుగులు సాధించాడు. బ్యాట‌ర్‌గా స‌క్సెస్ అయినా వార్న‌ర్ కెప్టెన్‌గా మాత్రం విఫ‌లయ్యాడు. 14 మ్యాచుల్లో ఢిల్లీ కేవ‌లం ఐదు మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయిన‌ప్ప‌టికీ అత‌డి పై న‌మ్మ‌కం ఉంచిన క్యాపిట‌ల్స్ ఐఎల్‌టీ20 లీగ్‌లో కెప్టెన్‌గా నియ‌మించింది.

కాగా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను విజేత‌గా నిలిపిన అనుభ‌వం వార్న‌ర్ ఉంది. పొట్టి ఫార్మాట్‌లో బ్యాట‌ర్‌గా అత‌డికి మంచి రికార్డు ఉంది. టీ20ల్లో వార్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు 356 మ్యాచ్ లు ఆడి 11,695 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా జ‌ట్టును టీ20 ఛాంపియ‌న్‌గా చేయ‌డంలో అత‌డు కీల‌క పాత్ర పోషించాడు.

IND vs SA 2nd Test : రెండో టెస్టుకు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇంత‌కంటే మంచి అవ‌కాశం భార‌త్‌కు దొర‌క‌దు

దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టు ఇదే : డేవిడ్‌ వార్నర్ ( కెప్టెన్ ), దుష్మంత చమీర, ఆండ్రూ టై, జో రూట్‌, మార్క్‌ వుడ్‌, దసున్‌ షనక, మాక్స్‌ హోల్డెన్‌, మ‌హ్మ‌ద్‌ మొహ్సిన్‌, నువాన్‌ తుషార, సామ్‌ బిల్లింగ్స్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, రజా ఆకిఫ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, రోలోఫ్‌ వాన్‌డెర్‌ మెర్వే, సదీర సమరవిక్రమ, సికిందర్‌ రజా.

 

View this post on Instagram

 

A post shared by Dubai Capitals (@dubaicapitals)