India Prisoners In Pak: పాక్ జైళ్లలో భారత పౌరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇండియాలో అయితే..

భారత్, పాకిస్థాన్‌లు తమతమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఆదివారం పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్పప్పటికీ 1992 నాటి సంప్రదాయాన్ని కొనసాగించాయి.

India Prisoners In Pak: భారత్, పాకిస్థాన్‌లు తమతమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఆదివారం పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్పప్పటికీ 1992 నాటి సంప్రదాయాన్ని కొనసాగించాయి. అయితే, రెండు దేశాల మధ్య ఇలా జాబితాలను సమర్పించుకోవటం 32వ సారి.

Pakistan Taliban Militants : పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ మిలిటెంట్లు

ఇరుదేశాలు సమర్పించుకున్న జాబితా ప్రకారం.. పాకిస్థాన్‌లో బదీలుగా 51 మంది భారతీయ పౌరులు ఉండగా, 654 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే జైలుశిక్ష పూర్తిచేసుకుని, జాతీయులుగా గుర్తించిన 631 మంది మత్స్యకారులు, ఇద్దరు సివిలియన్ ఖైదీలను త్వరిగతిన విడిచి పెట్టాలని పాకిస్థాన్‌ను కోరినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే పాక్ కస్టడీలో భారతీయులుగా అనుమానిస్తున్న 32 మంది మత్స్య కారులు, 22 మంది సివిలియన్ ఖైదీలను సైతం విడిచి పెట్టాలని భారత విదేశాఖ శాఖ పాకిస్థాన్ కు రాసిన లేఖద్వారా కోరింది.

India calls on Pakistan: పాకిస్థాన్‌లో హిందూ మహిళను అతి దారుణంగా చంపిన ఘటనపై భారత్ స్పందన

మరోవైపు భారతదేశంలోనూ పాకిస్థాన్ కు చెంది మత్స్యకారులు ఇతరులు బందీగా ఉన్నారు. వీరిలో 339 మంది సాధారణ పౌరులు కాగా, 95 మంది పాకిస్థానీ మత్స్యకారులు భారతదేశం కస్టడీలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు