India calls on Pakistan: పాకిస్థాన్‌లో హిందూ మహిళను అతి దారుణంగా చంపిన ఘటనపై భారత్ స్పందన

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనపై మాకు సమాచారం అందింది. అయితే, ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. మేము పదే పదే చెబుతున్నాం.. పాకిస్థాన్ లోని మైనారిటీలకు ఆ దేశ ప్రభుత్వం భద్రత కల్పిస్తూ సురక్షితంగా ఉండేలా చేయాలి’’ అని చెప్పారు.

India calls on Pakistan: పాకిస్థాన్‌లో హిందూ మహిళను అతి దారుణంగా చంపిన ఘటనపై భారత్ స్పందన

"Remain Vigilant" says India

India calls on Pakistan: పాకిస్థాన్‌లో దయా భెల్ అనే 40 ఏళ్ల హిందూ మహిళను అతి దారుణంగా చంపేసిన ఘటనపై భారత్ స్పందించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘ఈ ఘటనపై మాకు సమాచారం అందింది. అయితే, ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. మేము పదే పదే చెబుతున్నాం.. పాకిస్థాన్ లోని మైనారిటీలకు ఆ దేశ ప్రభుత్వం భద్రత కల్పిస్తూ సురక్షితంగా ఉండేలా చేయాలి’’ అని చెప్పారు.

కాగా, పాక్ లోని సింజోరోలో హిందూ మహిళ తల నరికి, ఆమె చర్మాన్ని కూడా ఒలిచేశారని ఆ దేశ మొట్టమొదటి హిందూ కమినిటీకి చెందిన మహిళా సెనేటర్ కృష్ణ కుమారి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆమె తలపై చర్మాన్ని కూడా ఒలిచేశారని చెప్పారు. పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయని అన్నారు.

దయా భెల్ మృతదేహాన్ని స్థానికులు పంట పొలాల్లో గుర్తించారని పోలీసులు చెప్పారు. ఆ మహిళ మృతదేహానికి పోర్టుమార్టం కూడా పూర్తిచేశారు. పాక్ లో హిందూ మహిళలు, అమ్మాయిలపై తరుచూ దారుణాలు జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని నిరోధించాలని పాక్ ప్రభుత్వానికి భారత్ గతంలోనూ సూచించింది.

Metro Services: అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు.. కొత్త సంవత్సర వేడుకల కోసం సేవల పొడిగింపు