రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అతడు బ్యాట్‌తో స్టంప్స్ ను కొట్టి హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అభినవ్ మనోహర్ తరువాత హిట్ వికెట్‌గా ఔటైన రెండో ఆటగాడిగా కృనాల్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. భువన్వేశర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 232 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులతో నిలిచింది. రొమారియో షెపర్డ్ ఔట్ కావడంతో కృనాల్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. అయితే.. ధాటిగా ఆడడంలో విఫలం అయ్యాడు. 6 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 8 పరుగులు చేసి 18.4 ఓవర్‌లో హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడు.
పాట్ కమిన్స్ వైడ్ యార్కర్‌గా బంతిని వేశాడు. దీంతో క్రీజ్‌లోపలికి వెళ్లి బంతిని కొట్టాలని కృనాల్ భావించాడు. అతడు బంతిని కొట్టే ప్రయత్నంలో బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టి ఔట్ అయ్యాడు.
ఆర్‌సీబీ తరుపున హిట్‌వికెట్‌గా ఎంత మంది ఔట్ అయ్యారంటే..?
కృనాల్ పాండ్యాతో కలిపి ఇప్పటి వరకు ఆర్‌సీబీ తరుపున ముగ్గురు మాత్రమే హిట్‌వికెట్ గా ఔట్ అయ్యారు. మిస్బా ఉల్ హక్, సౌరవ్ తివారీలు మాత్రమే కృనాల్ కన్నా ముందు ఆర్‌సీబీ తరుపున ఆడుతూ హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నారు.
మిస్బా ఉల్ హక్ – 2008లో పంజాబ్ పై
సౌరవ్ తివారీ – 2012లో ముంబై పై
కృనాల్ పాండ్యా – 2025లో లక్నో పై
ఇక ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ విఫలమైంది. 19.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో సన్‌రైజర్స్ 42 పరగుల తేడాతో విజయం సాధించింది.