Virat Kohli : టీ20ల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క ఆటగాడు..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే టీమ్ తరుపున 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మొత్తం 25 బంతులు ఎదుర్కొన్నాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 43 పరుగులు సాదించాడు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుననే ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఆర్‌సీబీ తరుపున 800 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
VIRAT KOHLI COMPLETED 800 FOURS FOR RCB 👑
– The Greatest ever…!!!! pic.twitter.com/w4TdEGvjid
— Johns. (@CricCrazyJohns) May 23, 2025
టీ20ల్లో ఒకే జట్టు తరుపున అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 801 ఫోర్లు
జేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 694 ఫోర్లు
అలెక్స్ హేల్స్ (నాటింగ్‌హామ్‌షైర్) – 563 ఫోర్లు
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 550 ఫోర్లు
ల్యూక్ రైట్ (సస్సెక్స్) – 529 ఫోర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (94 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), అభిషేక్ శర్మ (34; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ(26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) దంచికొట్టారు. ఆర్‌సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. భువన్వేశర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు తలా ఓ వికెట్ తీశారు.
RCB vs SRH : ఆర్‌సీబీ పై విజయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కామెంట్స్.. ఆలస్యమైంది కానీ..
ఆ తరువాత ఆర్‌సీబీ లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (62; 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (43; 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం అయ్యారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్, హర్ష్ దూబె, నితీశ్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ పడగొట్టారు.