RCB vs SRH : ఆర్‌సీబీ పై విజయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కామెంట్స్.. ఆలస్యమైంది కానీ..
ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుని టాప్-2 పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది.

Courtesy BCCI
ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుని టాప్-2 పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది. శుక్రవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పై సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (94 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), అభిషేక్ శర్మ (34; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ(26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. భువన్వేశర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం ఫిల్ సాల్ట్ (62; 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (43; 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో ఆర్‌సీబీ లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్షల్ పటేల్, హర్ష్ దూబె, నితీశ్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ పై విజయం సాధించడం పట్ల ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఆలస్యమైనప్పటికి.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌లో విజయం సాధించామన్నాడు. ఇప్పుడు నితీశ్ కుమార్ కూడా బౌలింగ్ చేస్తున్నాడని, తమకు ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం దొరికినట్లు అనిపిస్తుందన్నాడు. నితీశ్ మంచి బౌలర్ అని, అతడిని ఉపయోగించుకోవాలి అని అభిషేక్ తనకు ఎప్పుడూ చెబుతూ ఉంటాడని కమిన్స్ తెలిపాడు. ఇక బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ను ప్రశంసించాడు.
GT vs LSG : గుజరాత్ పై విజయం.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్.. మళ్లీ..
వాస్తవానికి తొలుత ఈ పిచ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా కమిన్స్ చెప్పాడు. ‘170 పరుగులు చేస్తే సరిపోతుందని భావించాం. అయితే.. బ్యాటర్లు వచ్చి బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉందని చెప్పారు. ఇక ఎషాన్ మలింగ ఎంతో గొప్ప ప్రతితావంతుండు. అతడు ఎక్కడైనా వికెట్లు తీస్తాడు. అతడి వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. యార్కర్లను వేగంగానే కాకుండా చాలా స్లోగా కూడా వేయగలడు.’ అని కమిన్స్ అన్నాడు.