GT vs LSG : గుజరాత్ పై విజయం.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్.. మళ్లీ..
గుజరాత్ పై విజయం సాధించిన తరువాత లక్నో జట్టు యజయాని సంజీవ్ గొయెంకా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన లక్నో జట్టు గురువారం గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇది ఆరో విజయం. కాగా.. లక్నో విజయం పట్ల ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 పరుగులు), రిషబ్ పంత్ (6 బంతుల్లో 16 పరుగులు) లు వేగంగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, అర్షద్ ఖాన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన బుమ్రా!
అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో షారుక్ ఖాన్ (57) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్‌మన్ గిల్ (35), జోస్ బట్లర్ (33), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (38) లు పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్క్ మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ మహారాజ్ సింగ్, షాబాజ్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
లక్నో విజయం పట్ల ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఓరూర్కే ప్రదర్శన ను మెచ్చుకున్నాడు.
Congratulations to @LucknowIPL and @RishabhPant17 on getting back to winning ways. Great performance by William O’Rourke, the newest member of the Super Giants family.
An inspiring initiative by @gujarat_titans to continue the tradition of stepping out in lavender, a strong… pic.twitter.com/0SEX7hjSux
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 22, 2025
‘తిరిగి విజయాల బాట పట్టినందుకు లక్నో, కెప్టెన్ రిషబ్ పంత్‌కు అభినందనలు. లక్నో కుటుంబంలోని కొత్త సభ్యుడు విలియం ఓరూర్కే అద్భుతమైన ప్రదర్శన చేశాడు. లావెండర్‌లో అడుగు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించడానికి @gujarat_titans చేసిన స్ఫూర్తిదాయకమైన చొరవ, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో సంఘీభావం యొక్క బలమైన సందేశం, గొప్ప కారణాల కోసం క్రీడ మనల్ని ఎలా ఏకం చేయగలదో శక్తివంతమైన జ్ఞాపిక.’ అని గొయెంకా రాసుకొచ్చాడు.
ఇక లక్నో జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను మే 27 మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు లక్నోలోని ఎకానా స్టేడియం వేదిక కానుంది.