GT vs LSG : హ్యాండ్ షేక్ చేస్తున్న‌ప్పుడు పంత్‌ను ప‌ట్టించుకోని గిల్‌!.. వీడియో వైర‌ల్‌.. స్వార్థ‌ప‌రుడు..

గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది.

GT vs LSG : హ్యాండ్ షేక్ చేస్తున్న‌ప్పుడు పంత్‌ను ప‌ట్టించుకోని గిల్‌!.. వీడియో వైర‌ల్‌.. స్వార్థ‌ప‌రుడు..

IPL 2025 GT vs LSG During Handshake Shubman Gill Ignore Rishabh Pant

Updated On : May 23, 2025 / 10:08 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. కాగా.. ఈ ఓట‌మి లీగ్ ద‌శ ముగిసే స‌రికి టాప్‌-2 స్థానంలో నిల‌వాల‌న్న గుజ‌రాత్ అవ‌క‌శాల‌ను సంక్లిష్టం చేసింది.

ల‌క్నో చేతిలో ఓడిపోయిన‌ప్ప‌టికి ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ 18 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలోనే ఉంది. అయితే.. చివ‌రి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ విజ‌యం సాధించినా కూడా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2 స్థానంలో నిలుస్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఇందుకు కార‌ణం.. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆర్‌సీబీ(17 పాయింట్లు), పంజాబ్ (17 పాయింట్లు)జ‌ట్లు త‌మ చివ‌రి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధిస్తే అప్పుడు గుజ‌రాత్ మూడో స్థానానికి ప‌డిపోతుంది.

GT vs LSG : లక్నో పై ఓట‌మి.. గుజరాత్ కెప్టెన్ గిల్ కామెంట్స్‌.. ప్లేఆఫ్స్‌కు ముందు..

ఈ నేప‌థ్యంలో ల‌క్నో చేతిలో ఓడిపోవ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ తీవ్ర నిరాశ చెందిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మ్యాచ్ ముగిసిన త‌రువాత రెండు జ‌ట్ల ఆట‌గాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే స‌మ‌యంలో గిల్.. ప్ర‌త్య‌ర్థి కెప్టెన్ రిష‌బ్ పంత్ చెబుతున్న మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

గిల్ స్వార్థ‌ప‌రుడు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఆట‌లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జం అని అంటున్నారు. రోహిత్ శ‌ర్మ టెస్టుకు వీడ్కోలు చెప్పిన నేప‌థ్యంలో గిల్ కెప్టెన్ అవుతాడ‌ని, పంత్ వైస్ కెప్టెన్ అవుతాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో గిల్ ఇలా చేయ‌డంతో.. ఈ విష‌యం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

GT : ల‌క్నో చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్‌కు కొత్త క‌ష్టం.. గిల్ ఇప్పుడేం చేస్తాడో.. ఆనందంలో ఆర్‌సీబీ, పంజాబ్ జ‌ట్లు..