IPL 2025: సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయినా ‘నో ప్రాబ్లమ్’.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి ఆర్సీబీ..! ఎలా అంటే..?
ఐపీఎల్-2025 సీజన్‌లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.

IPL 2025: ఐపీఎల్ 2025 లో భాగంగా నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ నాలుగు జట్ల మధ్య మొదటి, రెండో స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది. మ్యాచ్ ముందు వరకు పాయింట్ల పట్టికలో టాప్ -2 ప్లేస్ లో ఉన్న ఆర్సీబీ మూడో ప్లేస్ కు పడిపోయింది. అయితే, మళ్లీ మొదటి, రెండు స్థానాలకు చేరుకునేందుకు ఆర్సీబీకి అవకాశాలు ఉన్నాయి. అవి ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Also Read: GT vs LSG : గుజరాత్ పై విజయం.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్.. మళ్లీ..
ఐపీఎల్-2025 సీజన్‌లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ఎందుకంటే.. మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు సెమీ ఫైనల్స్‌లో మొదటి మ్యాచ్ ఓడిపోయినా మళ్లీ ఆడేందుకు అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ మ్యాచ్ లో విజయం సాధించినా.. టాప్- 1, 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుపై ఆడి గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఫైనల్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది.
శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విజయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో టాప్ -1, 2 స్థానాల్లోకి వెళ్లేందుకు ఆర్సీబీకి అవకాశం ఉంది.
♦ ఆర్సీబీ ఈనెల 27న లీగ్ దశలో తన చివరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తప్పని సరిగా విజయం సాధించాలి.
♦ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు 25న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ఆడనుంది.
♦ ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓడిపోయి.. లక్నో జట్టుపై ఆర్సీబీ విజయం సాధిస్తే.. ఆర్సీబీకి టాప్ -2 ప్లేస్ ఖాయం అవుతుంది.
♦ ప్రస్తుతం టాప్-2లో ఉన్న పంజాబ్ జట్టు తదుపరి ఆడే (ఢిల్లీ, ముంబై) మ్యాచ్ లలో, గుజరాత్ జట్టు సీఎస్కే పై ఓడిపోయి.. లక్నో జట్టుపై ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది.