Do you know how many times India lost matches when Virat Kohli hits a century
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ పరుగుల యంత్రం దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో శతకాల మోత మోగిస్తున్నాడు. వరుసగా రెండు వన్డే మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. రాంచి వేదికగా జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేయగా బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 102 పరుగులు సాధించాడు.
అయితే.. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించగా రెండో వన్డే మ్యాచ్‌లో మాత్రం 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీలు చేసిన సమయంలో ఎన్ని మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా పరాజయం పాలైందో ఓ సారి చూద్దాం..
కోహ్లీ ఇప్పటి వరకు వన్డేల్లో 53 శతకాలు బాదాడు. అతడు సెంచరీ చేసిన మ్యాచ్‌ల్లో చాలా తక్కువ మ్యాచ్‌ల్లోనే భారత్ ఓడిపోయింది. గతంలో ఏడు మ్యాచ్‌లు ఓడిపోగా తాజాగా రాయ్‌పూర్ మ్యాచ్‌తో కలిపితే ఎనిమిదవది మాత్రమే.
కోహ్లీ సెంచరీ చేసినా భారత్ ఓడిపోయిన వన్డే మ్యాచ్‌లు ఇవే..
* ఇంగ్లాండ్ పై 107 పరుగులు కార్డిఫ్ (సెప్టెంబర్ 2011)
* న్యూజిలాండ్ పై 123 పరుగులు నేపియర్ (జనవరి 2014)
* ఆస్ట్రేలియా పై 117 పరుగులు మెల్‌బోర్న్ (జనవరి 2016)
* ఆస్ట్రేలియాపై 106 పరుగులు కాన్‌బెర్రా (జనవరి 2016)
* న్యూజిలాండ్ పై 121 పరుగులు ముంబయి (అక్టోబర్ 2017)
* వెస్టిండీస్ పై 107 పరుగులు పూణె (అక్టోబర్ 2018)
* ఆస్ట్రేలియాపై 123 పరుగులు రాంచీ (మార్చి 2019)
* దక్షిణాఫ్రికాపై 102 పరుగులు రాయ్‌పుర్ (డిసెంబర్ 2025)