IND vs SA : అరె ఏంట్రా ఇది.. తుది జట్టులో లేకపోయినా.. బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. వీడియో
రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) భారత్ ఓడిపోయింది.
IND vs SA 2nd ODI Tilak Verma Gravity Defying Catch In 2nd ODI Sets Internet Ablaze
IND vs SA : రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయినప్పటికి కూడా తెలుగు ఆటగాడు, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా ఆకట్టుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అతడు చేసిన అసాధారణ ఫీల్డింగ్ విన్యాసం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే..?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్‌క్రమ్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి దాదాపుగా సిక్స్‌గా వెలుతుంది. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న తిలక్ శర్మ అద్భుతం చేశాడు.
Temba Bavuma : అందువల్లే మేం గెలిచాం.. మా విశ్వాసం రెట్టింపైంది.. ఇక చూస్కోండి..
Superman Verma said nope. pic.twitter.com/ceussdMyHK
— Out Of Context Cricket (@GemsOfCricket) December 3, 2025
అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అయితే.. జంప్ చేయడంతో బౌండరీ లైన్ ఆవల పడిపోతున్న విషయాన్ని అతడు గ్రహించాడు. వెంటనే సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. గాల్లో ఉండగానే బంతిని బౌండరీ మైదానంలోకి విసిరివేశాడు.
ఈ క్రమంలో అతడు 5 పరుగులు సేవ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిని సూపర్ మ్యాన్ అని, సూపర్‌మ్యాన్ వర్మ అని కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో అతడు తుది జట్టులో చోటు దక్కించుకుని 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చాలా మంది ఊహించారు. అయితే.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం మాత్రం ఆ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్‌కు ఇవ్వాలని నిర్ణయించడంతో తిలక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.
Defying gravity 😮
What an effort by Tilak Varma 👏
📽️ Click on the link below & watch his acrobatic save 🔽https://t.co/BPfBAg5TTo#TeamIndia | #INDvSA | @TilakV9 | @IDFCFIRSTBank pic.twitter.com/Q7u5lSqpM2
— BCCI (@BCCI) December 3, 2025
