Sanju Samson Net Worth 2025 : సంజూ శాంస‌న్ ఆస్తి ఎంతో తెలుసా? కోట్లలో జీతం.. రాజభవనం లాంటి ఇల్లు.!

2025 నాటికి టీమ్ఇండియా వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ సంజూ శాంస‌న్నిక‌ర ఆస్తి విలువ (Sanju Samson Net Worth 2025) దాదాపు..

Do you know how much Sanju Samson Net Worth 2025

Sanju Samson Net Worth 2025 : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson) గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తాడు. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే.. త‌న‌ను విడిచిపెట్టాల‌ని అత‌డు రాజ‌స్థాన్‌ను కోరిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో అత‌డిని ట్రేడ్ ద్వారా ద‌గ్గించుకునేందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌మ ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది.

1994లో కేర‌ళ‌లోని పుల్లువిలో జ‌న్మించాడు శాంస‌న్. అత‌డి చిన్న‌త‌నంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. అయిన‌ప్ప‌టికి ఆట పై ఉన్న మ‌క్కువ‌ను వ‌దులుకోలేదు. ఐపీఎల్ ద్వారా అత‌డి జీవితం మారిపోయింది. ఆ త‌రువాత టీమ్ఇండియాలోనూ చోటు ద‌క్కించుకున్నాడు.

నిక‌ర ఆస్తి విలువ ఎంతంటే?

2025 నాటికి సంజూ శాంస‌న్ నిక‌ర ఆస్తి విలువ (Sanju Samson Net Worth 2025)దాదాపు 80 నుంచి 86 కోట్లుగా అంచ‌నా. ఐపీఎల్ జీతం, బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజులు, ఎండార్స్‌మెంట్‌లు అత‌డి ఆదాయంలో ప్ర‌ధాన వ‌న‌రులు.

Yash Dhull : మెగావేలంలో అమ్ముడుపోలేదు.. క‌ట్ చేస్తే ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లు.. 180.25 స్ట్రైక్‌రేటుతో 292 ప‌రుగులు

ప్ర‌స్తుతం అత‌డు బీసీసీఐ సెంట్ర‌ల్ క్రాంటాక్టు గ్రేడ్ సిలో ఉన్నాడు. దీంతో అత‌ డికి సంవ‌త్స‌రానికి కోటి రూపాయ‌లు జీతంగా అందుతుంది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులు అద‌నం. ప్ర‌తి టెస్టు మ్యాచ్‌కు రూ.15ల‌క్ష‌లు, వ‌న్డేకు రూ.6ల‌క్ష‌లు, టీ20కి రూ.3ల‌క్ష‌లు మ్యాచ్‌గా అందుకుంటాడు.

ఇక‌ ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.18కోట్లు అత‌డికి చెల్లించింది.

ఎండార్స్‌మెంట్ డీల్స్..

శాంస‌న్ అనేక పెద్ద బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నాడు. జిల్లెట్, భారత్‌పే, వాక్‌మేట్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. నివేదికల ప్రకారం అతను ఒక్కో ఒప్పందానికి దాదాపు రూ. 25-40 లక్షలు వసూలు చేస్తాడు.

ల‌గ్జ‌రీ కార్లు..

శాంస‌న్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని కలెక్షన్ లో రేంజ్ రోవర్ స్పోర్ట్, BMW 5 సిరీస్, ఆడి A6, మెర్సిడెస్-బెంజ్ C-క్లాస్ వంటి మోడళ్లు ఉన్నాయి.

Virat Kohli : అయ్యో కోహ్లీ.. నీకు త‌ప్ప‌డం లేదుగా.. భార్య‌తో వెళితే.. ఓ చేతిలో గొడుగు, మ‌రో చేతిలో..

విలాస‌వంత‌మైన ఇల్లు..

కేర‌ళ‌లోని విజింబంలో శాంస‌న్‌కు రూ.6 కోట్లు విలువ చేసే విలాస‌వంత‌మైన ఇల్లు ఉంది. కేర‌ళ‌తో పాటు, బెంగ‌ళూరు, ముంబై, హైద‌రాబాద్‌ల‌లో అత‌డికి ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.4కోట్లుగా తెలుస్తోంది.