DO you know Ravichandran Ashwin how much money earn from IPL Career
R Ashwin : టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ 2009లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. 221 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో భాగం అయ్యాడు.
ఐపీఎల్‌లో అశ్విన్ ఆడిన జట్లు ఇవే..
* చెన్నై సూపర్ కింగ్స్ (2009 నుంచి 15 వరకు, 2025లో)
* రైజింగ్ పూణే సూపర్ జెయింట్ (2016, 17)
* పంజాబ్ కింగ్స్ (2018 నుంచి 19వరకు )
* ఢిల్లీ క్యాపిటల్స్ (2020, 21)
* రాజస్థాన్ రాయల్స్ (2022 నుంచి 2024 వరకు)
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో మరో 4 సిక్సర్లు బాదితే..
కెప్టెన్సీ..
అశ్విన్ 2018, 19 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించాడు. 28 మ్యాచ్‌ల్లో అతడు నాయకత్వం వహించగా పంజాబ్ 12 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది.
ఐపీఎల్ ద్వారా ఎంత సంపాదించాడంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా అశ్విన్ ఐపీఎల్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2009లో అతడిని చెన్నై రూ.12లక్షలకు కొనుగోలు చేసింది. 17 సంవత్సరాల ఐపీఎల్ ప్రయాణంలో 5 జట్ల తరుపున ఆడిన అశ్విన్ దాదాపు రూ.97 కోట్ల 24 లక్షలు సంపాదించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై అతడిని రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అతడు తన ఐపీఎల్ కెరీర్‌లో ఓ సీజన్‌కు అందుకున్న అత్యధిక మొత్తం కావడం గమనార్హం.
ఇక రవిచంద్రన్ అశ్విన్ మొత్తం నికర విలువ దాదాపు రూ.132 కోట్లగా తెలుస్తోంది.