Do you know Shubman Gill have Worst batting records in England
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడంతో శుభ్‌మన్ గిల్ టీమ్ఇండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అతడు ఆడే నాలుగో స్థానంలోనూ గిల్ బ్యాటింగ్‌కు రానున్నట్లు వైస్ కెప్టెన్ పంత్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గా గిల్ ఎలా ఆడతాడు అన్న సందేహం అందరిలో ఉంది.
స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించే గిల్ విదేశాల్లో మాత్రం తడబడడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు గిల్ విదేశాల్లో 15 టెస్టులు ఆడాడు. 28 ఇన్నింగ్స్‌ల్లో 27.53 సగటుతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. అది కూడా పసికూన బంగ్లాదేశ్ పైనే చేశాడు. ఇక సెనా దేశాలు (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఘోరంగా విఫలం అయ్యాడు.
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు మూడు గిల్ మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. 14.66 సగటుతో 88 పరుగులు మాత్రమే సాధించాడు. బాల్ స్వింగ్ అయితే ఆడలేడనే అపవాదు ఉంది. ఇంగ్లాండ్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వింగ్ బంతులతో ఇంగ్లీష్ బౌలర్లు పెట్టే పరీక్షలో గిల్ ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాల్సిందే.
ముందుండి నడిపిస్తాడా?
ఈ సిరీస్‌లో గిల్ పై చాలా పెద్ద బాధ్యతే ఉంది. ఓ కెప్టెన్‌గా అతడు జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతడు బ్యాటింగ్‌లో రాణించి జట్టుకు మార్గనిర్దేశ్యం చేయాలి. లేదంటే డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశ తప్పదు. కెప్టెన్ డీలా పడితే అది జట్టు ప్రదర్శనపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఇంగ్లాండ్ కఠిన పరీక్షను గిల్ ఎలాఎదుర్కొంటాడో చూడాల్సిందే.
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు – లార్డ్స్
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కెన్నింగ్టన్ ఓవల్