Site icon 10TV Telugu

Yashasvi Jaiswal : ముంబై టు గోవా.. నో.. నో.. య‌శ‌స్వి జైస్వాల్ యూట‌ర్న్ వెనుక అస‌లు కార‌ణం ఇదేనా..

Domestic cricket Rohit Sharma convinced Yashasvi Jaiswal to stay with Mumbai

Domestic cricket Rohit Sharma convinced Yashasvi Jaiswal to stay with Mumbai

టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు య‌శ‌స్వి జైస్వాల్‌. అయితే.. అత‌డు ఇంగ్లాండ్‌తో సిరీస్ క‌న్నా ముందు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో అత‌డు ముంబైని వీడి గోవాకు ఆడాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ముంబై క్రికెట్ అసోసియేష‌న్ నుంచి ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా తీసుకున్నాడు. అయితే.. కొన్ని రోజుల‌కే త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. ముంబైకే ఆడాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. త‌న‌కు ఇచ్చిన ఎన్ఓసీని ర‌ద్దు చేయాల‌ని కోరాడు.

జైస్వాల్ ఇలా రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న నిర్ణ‌యాన్ని ఎందుకు మార్చుకున్నాడు అన్నది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వరికి తెలియ‌దు. తాజాగా దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ స్పందించారు. జైస్వాల్ ముంబై నుంచి గోవాకు వెళ్ల‌కుండా రోహిత్ శ‌ర్మ ఆపాడ‌న్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ స‌మ‌యంలో జ‌ట్టు మార‌డం వ‌ల్ల ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని య‌శ‌స్విని రోహిత్ ఒప్పించిన‌ట్లుగా నాయ‌క్ తెలిపాడు.

Chris Woakes : రిష‌బ్ పంత్‌కు సారీ చెప్పిన క్రిస్‌వోక్స్‌.. వాయిస్ నోట్ పంపిన టీమ్ఇండియా వికెట్ కీప‌ర్.. ఏమ‌న్నాడంటే..?

“రంజీల్లో ముంబై జ‌ట్టు 42 సార్లు విజేత‌గా నిలిచింది. ఇలాంటి జ‌ట్టు త‌రుపున ఆడ‌డం ఎంతో గౌర‌వంతో కూడుకున్న‌ది. స్టార్ క్రికెట‌ర్‌గా ఎదగ‌డానికి ఓ ప్లాట్‌పామ్‌గా ఈ జ‌ట్టు సాయ‌ప‌డింద‌నే విష‌యాన్ని మ‌నం మ‌రిచిపోకూడ‌దు.” అని య‌శ‌స్వితో రోహిత్ శ‌ర్మ చెప్పాడు. హిట్‌మ్యాన్‌తో మాట్లాడిన త‌రువాత య‌శ‌స్వి ప‌లువురు ఇత‌ర పెద్ద‌ల‌తో మాట్లాడి.. త‌న ఎన్‌వోసీని వెన‌క్కి తీసుకోవాల‌ని మెయిల్ చేసిన‌ట్లు నాయ‌క్ చెప్పాడు. అందుకు తాము అంగీక‌రించిన‌ట్లు తెలిపాడు.

MS Dhoni : రిటైర్‌మెంట్ పై స్పందించిన ధోని.. అదే స‌మ‌యంలో కోహ్లీలోని క‌ళాకారుడి గురించి ఏమ‌న్నాడంటే ?

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో య‌శ‌స్వి జైస్వాల్ రాణించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 41.10 సగటుతో 411 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచ‌రీలు, రెండు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

Exit mobile version